Telugu Global
Travel

కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం

Kolhapur Mahalakshmi Temple | సిరులను, సౌఖ్యాలను, సౌభాగ్యాన్ని, సుఖసంతోషాలను ప్రసాదించే దేవతగా కొల్హాపూర్లోనిమహాలక్ష్మిని కొలుస్తారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని నోములు, వ్రతాలతో కొలుస్తారు.

కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం
X

కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం

సిరులను, సౌఖ్యాలను, సౌభాగ్యాన్ని, సుఖసంతోషాలను ప్రసాదించే దేవతగా కొల్హాపూర్లోనిమహాలక్ష్మిని కొలుస్తారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని నోములు, వ్రతాలతో కొలుస్తారు.

కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవి ఆలయం అష్టాదశశక్తిపీఠాలలో 7వ శక్తి కీనంగా పూజింపబడుతోంది. మహారాష్ట్రీయులు కొల్హాపూర్లక్ష్మి అమ్మవారిని అంబాబాయిగాపిలుచుకుంటూ కొలుచు కుంటారు. కొల్లా అంటే లోయ అని, పూర్ అంటే పట్టణ మని అర్థం.లోయ ప్రాంతంలో ఉన్న పట్టణం కాబట్టి దీనికి కొల్హాపూర్ అనే పేరు ఏర్పడినట్లుగా స్థానికులుచెబుతున్నారు.

శ్రావణమాసంలో ఈ ఆలయంలో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అమ్మవారినిదర్శించ రద్దీగా ఉంటుంది.పురాణాలలో ఈ ఆలయం గురించి ఉంది. ఈ క్షేత్రంలోనే శివునికీ, శ్రీ మహావిష్ణువుకూ ఉపాలయాలు ఉన్నాయి. ప్రాచీన, సనాతన భారతీయనిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.రోజూ సూర్య కిరణాలు అమ్మవారిని స్పృశించే విధంగా ఆలయాన్ని నిర్మించడం ఓ ప్రత్యేకత.

కొల్లపూర్ ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీదేవికిప్రతి రోజు అయిదు సార్లు అర్చన చేస్తారు.

ఉదయం అయిదు గంటలకు సుప్రభాతసమయంలో అమ్మవారికి సుప్రభాత సేవజరుగుతుంది. 8 గంటలకు షోడశోపచారాలతో అమ్మవారినిపూజిస్తారు.మద్యాహ్నం, సాయంత్రం సమయాలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు . ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ విశేష పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలాంటివిజరుగుతాయి. ప్రతిరోజూ ఎందరో భక్తులు వస్తున్నప్పటికీ శుక్రవారం మాత్రం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారినిదర్శించుకుంటారు గర్భగుడిలో గోడ మీద శ్రీ యంత్రం కనిపిస్తుంది. అమ్మవారి విగ్రహాన్ని నల్ల రాతితోతయారు చేశారు. ఈ విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. అమ్మవారు నాలుగు హస్తాలను కలిగి ఉంటుంది. కుడిచేతి పై హస్తంలో గద,క్రింది హస్తంలో మాతుంగ ధరించి ఉంటుంది.


ఎడమ వైపు పై చేతిలో భేతకమనే రక్షణ కవచం,కిందివైపు ఉండే ఎడమ హస్తంలో పానపాత్ర ఉంటాయి. విగ్రహం వెనుకవైపు శిలతో చెక్కినసింహం కనిపిస్తుంది. ఆలయానికి కొంతదూరంలో మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. అందులో స్నానమాచరించి, దాని ఒడ్డునే ఉన్న శ్రీ విశ్వేశ్వరాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే అమ్మవారి దర్శనానికి వెళ్తారు భక్తులు.

కొల్హాపూర్లో అమ్మవారు కొలువై ఉండటానికివెనుక స్థలపురాణ కథలు ఉన్నాయి. అగస్త్య మహర్షి శివభక్తుడు. ప్రతి సంవత్సరం ఆయనకాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించుకునేవాడు.వయసు పెరుగుతుంటే వృద్ధాప్య స్థితిలో కాశీకి వెళ్ళే శక్తి లేక పోవడంతో శివుని గురించి తపస్సుచేశాడా మహర్షి శివుడు ప్రత్యక్షమై ఆ మహర్షి కోరికేమిటో చెప్పమని అడిగాడు. తాను ప్రతిఏటా కాశీకి వచ్చి తమ దర్శనంచేసుకుంటున్నాననీ, కానీ ఈ వృద్ధాప్య దశలోశక్తి సన్నగిల్లటంతో కాశీకి రాలేక పోతున్నాననీ కాశీకి ప్రత్యామ్నాయంగా ఏదైనా క్షేత్రాన్నిసూచించమని కోరాడు అగస్త్యుడు. అప్పుడు.

శంకరుడు కొల్హాపురిలోని శ్రీ మహాలక్ష్మిఅమ్మవారిని దర్శిస్తే తనను దర్శించినంత పుణ లభిస్తుందని చెప్పాడు. శివుడు కూడా విశ్వేశ్వరుమహాదేవ్ పేరుతో కొల్హాపూర్లో కొలువు తీరి ఉన్నాడు.


పురాణ కథ ప్రకారంగా ప్రళయ కాల సమయంలో పరమేశ్వరుడు తన త్రిశూలంతోకాశీ నగరాన్ని పైకి ఎత్తి పెట్టి రక్షించాడట,నీటిలో మునిగి పోయిన ఈ క్షేత్రాన్ని శ్రీమహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తిందని, అందువల్ల ఈ క్షేత్రానికి కరవీరక్షేత్రమని పేరు వచ్చిందని చెబుతారు. ఈక్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత, శివుడు

జల రూపం కాగా విష్ణుమూర్తి రాయిగానూ,మహర్షులు ఇసుక గానూ దేవతలు వృక్షాలు గాను ఈపుణ్యక్షేత్రంలోసూర్యగ్రహణం రోజున కొలువై ఉంటారని, సమస్త పుణ్యతీర్థాలు ఇక్కడే ఉంటాయనీ, మణికర్ణికాకుండంలో స్నానం చేస్తే వారి పాపాలునశించి పోతాయనీ, అమ్మవారి దర్శనంతో సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, సుఖసంతోషాలు పొందుతారనీ భక్తులప్రగాఢ విశ్వాసం.

సూర్యగ్రహణం రోజున కొలను వద్ద ఆలయంలోనూ జనం కిక్కిరిసి ఉంటారు. కొల్హాపురిని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్నమహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అనికూడా చెబుతారు. పద్మపురాణం, దేవీ భాగవతం, స్కంద పురాణంలో అమ్మవారి ప్రస్తావన ఉంది,

శ్రీ మహా లక్ష్మీ దేవతాయై నమః

- రసస్రవంతి 'కావ్యసుధ '

First Published:  15 July 2023 4:00 PM IST
Next Story