కేరళ హిల్స్ అండ్ వాటర్స్ టూర్.. ప్యాకేజీ వివరాలివే
వాతావరణం చల్లబడుతున్న వేళ కేరళలోని హిల్ స్టేషన్స్, బ్యాక్ వాటర్స్‌ను కలిపి ఎక్స్‌ప్లోర్ చేయాలనుకునేవాళ్ల కోసం ఐఆర్‌సీటీసీ ‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ పేరుతో టూర్ ఆపరేట్ చేస్తోంది.
వాతావరణం చల్లబడుతున్న వేళ కేరళలోని హిల్ స్టేషన్స్, బ్యాక్ వాటర్స్‌ను కలిపి ఎక్స్‌ప్లోర్ చేయాలనుకునేవాళ్ల కోసం ఐఆర్‌సీటీసీ ‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ పేరుతో టూర్ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ఎలా ఉంటుందంటే..
ఐఆర్‌సీటిసీ ‘కేరళ హిల్స్ అండ్ వాటర్స్’ టూర్.. కేరళలోని మున్నార్, అలపుజా ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు సాగే ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. ఈ ట్రిప్ ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ట్రిప్ అక్టోబర్ 24 న ఉంది.
ప్రయాణం ఇలా..
మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడంతో టూర్ మొదలవుతుంది. ఓవర్‌నైట్ జర్నీ చేసిన తర్వాత రెండో రోజు 12:55 గంటలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి వెహికల్‌లో మున్నార్‌కు బయలుదేరతారు. రాత్రికి మున్నార్ చేరుకుని అక్కడే హోటల్‌లో స్టే చేస్తారు. మూడోరోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఎకో-పాయింట్ వంటివి విజిట్ చేయొచ్చు.
మూడో రోజు రాత్రి కూడా మున్నార్‌లోనే స్టే చేస్తారు. నాలుగో రోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసి.. అలపుజా బయలుదేరతారు. హోటల్‌లో చెక్‌ఇన్ అయిన తర్వాత బ్యాక్‌వాటర్స్‌పై బోట్ క్రూజ్‌కు వెళ్తారు. రోజంతా అలపుజాలో గడిపి రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు. ఇక ఐదో రోజు హోటల్ చెక్‌అవుట్ చేసి ఎర్నాకులం బయలుదేరతారు. మధ్యాహ్నం11:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే.. ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. అక్కడితో టూర్ ముగుస్తుంది.
కేరళ హిల్స్ అండ్ వాటర్స్ టూర్ ప్యాకేజీ ధరలు కంఫర్ట్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 15,580, ట్విన్ షేరింగ్‌కు 19,370, సింగిల్ షేరింగ్ అయితే 33,480 గా ఉన్నాయి. స్లీపల్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 12,880, ట్విన్ షేరింగ్‌కు రూ. 16,660, సింగిల్ షేరింగ్‌కు 30,770 గా ఉన్నాయి.
ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, హోటల్ స్టే, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. టూరిస్ట్ ప్లేసుల్లో ఎంట్రీ టిక్కెట్లు, బోటింగ్ ఛార్జీల వంటివి టూరిస్టులే చూసుకోవాలి.