ఐఆర్‌సీటీసీ మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర టూర్.. ప్యాకేజీ వివరాలివే..
మహారాష్ట్రలోని షిరిడీ, నాసిక్, ఎల్లోరా గుహల వంటి ప్రదేశాలు చూడడం కోసం ఐఆర్‌సీటీసీ.. ‘మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర’ టూర్ ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ నాలుగు రోజుల పాటు ఉంటుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని షిరిడీ, నాసిక్, ఎల్లోరా గుహల వంటి ప్రదేశాలు చూడడం కోసం ఐఆర్‌సీటీసీ.. ‘మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర’ టూర్ ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ నాలుగు రోజుల పాటు ఉంటుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర టూర్ అక్టోబర్ 15 న మొదలవుతుంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకుఫ్లైట్ ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ మూడు రాత్రులు నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఇందులో షిరిడీ, నాసిక్, ఎల్లోరా, శనిసింగనాపూర్, ఔరంగాబాద్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.
ప్రయాణం ఇలా..
అక్టోబర్ 15న మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1.50 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే 3.00 గంటలకు షిరిడీ చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం సాయిబాబా ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి షిరిడీలోని హోటల్‌లో స్టే చేస్తారు.
రెండో రోజు ఉదయం నాసిక్ బయల్దేరతారు. నాసిక్‌లో త్రయంబకేశ్వర ఆలయం, పంచవటి వంటివి చూసుకుని.. సాయంత్రానికి తిరిగి షిరిడీ చేరుకుంటారు. రాత్రికి షిరిడీలో స్టే ఉంటుంది.
మూడో రోజు ఉదయం శనిసింగనాపూర్ బయల్దేరతారు. అక్కడ శనీశ్వర ఆలయం చూసుకుని తర్వాత ఎల్లోరా బయల్దేరతారు. అక్కడ ఎల్లోరా గుహలు, ఘృష్ణేశ్వర్ ఆలయం చూసుకుని.. తర్వాత ఔరంగాబాద్ బయల్దేరతారు. ఆ రోజు రాత్రి ఔరంగాబాద్‌లో స్టే ఉంటుంది. నాలుగో రోజు ఔరంగాబాద్‌లోని మినీ తాజ్‌మహల్ (బీబీ కా మక్బారా) విజిట్ చేసి.. సాయంత్రానికి ఔరంగాబాద్‌లో రిటర్న్ ఫ్లైట్ ఎక్కుతారు. నాలుగో రోజు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ ‘మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర’ టూర్ ప్యాకేజీ ధరలు.. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో రూ.20,950, డబుల్ ఆక్యుపెన్సీలో రూ.21,200, సింగిల్ ఆక్యుపెన్సీలో రూ.25,550గా ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.