Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ ‘మ్యాజిక్ ఆఫ్ మలబార్’ టూర్.. ప్యాకేజీ వివరాలివే..

ఐఆర్‌‌సీటీసీ ‘మ్యాజిక్ ఆఫ్ మలబార్’ టూర్.. డిసెంబర్ 11న స్టార్ట్ అవుతుంది. ఈ టూర్ లో భాగంగా కేరళలోని కన్నూర్, వయానాడ్, గురువాయుర్, త్రిసూర్ వంటి ప్రాంతాలు కవర్ చేయొచ్చు.

ఐఆర్‌‌సీటీసీ ‘మ్యాజిక్ ఆఫ్ మలబార్’ టూర్.. ప్యాకేజీ వివరాలివే..
X

ఐఆర్‌‌సీటీసీ ‘మ్యాజిక్ ఆఫ్ మలబార్’ టూర్.. ప్యాకేజీ వివరాలివే..

మంచుకురిసే వింటర్‌‌లో కేరళ ట్రిప్ వేయాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ‘మ్యాజిక్ ఆఫ్ మలబార్’ పేరుతో కేరళ టూర్ రెడీ చేసింది. హైదరాబాద్‌లో మొదలయ్యే ఈ టూర్.. 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగుతుంది. ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..

ఐఆర్‌‌సీటీసీ ‘మ్యాజిక్ ఆఫ్ మలబార్’ టూర్.. డిసెంబర్ 11న స్టార్ట్ అవుతుంది. ఈ టూర్ లో భాగంగా కేరళలోని కన్నూర్, వయానాడ్, గురువాయుర్, త్రిసూర్ వంటి ప్రాంతాలు కవర్ చేయొచ్చు.

ప్రయాణం ఇలా..

డిసెంబర్ 11 న ఉదయం 6.15 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కడంతో కేరళ టూర్ మొదలవుతుంది. ప్రయాణీకులు ఉదయం 8.25 గంటలకల్లా కన్నూర్ చేరుకుంటారు. తర్వాత హోటల్‌కి చేరుకుని అక్కడ్నుంచి ‘సెయింట్ ఏంజెలో’ ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం, ఎజిమల హిల్ వ్యూపాయింట్ వంటివి చూడొచ్చు. మొదటి రోజు రాత్రి కన్నూర్‌ హోటల్‌లో స్టే ఉంటుంది. రెండో రోజు వయానాడ్ బయల్దేరతారు. అక్కడ బనసురసాగర్ డ్యామ్, అంబలవయల్ హెరిటేజ్ మ్యూజియం వంటివి చూసి.. రాత్రికి వయానాడ్‌లోని హోటల్‌కు చేరుకుంటారు. మూడో రోజు వయానాడ్ జిల్లాలోని కురువా ఐల్యాండ్, తినెల్లి ఆలయంతో పలు లోకల్ సైట్స్ విజిట్ చేస్తారు.

నాలుగో రోజు వయానాడ్‌లోని పోకొడె లేక్, లక్కిడి వ్యూపాయింట్ వంటివి చూసి.. ఆ తర్వాత కోజికోడ్‌ బీచ్‌కువెళ్లి.. సాయంత్రానికి గురువాయుర్ బయల్దేరతారు. నాలుగోరోజు రాత్రి గురువాయుర్‌లో స్టే చేస్తారు. ఐదో రోజు ఉదయాన్నే గురువాయుర్ ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత మెరైన్ వాల్డ్ అక్వేరియం చూసి, లోకల్ సైట్ సీయింగ్ చేసి రాత్రికి గురువాయుర్‌లో స్టే చేస్తారు. ఇక ఆరో రోజు పొద్దున్నే త్రిసూర్ జిల్లాలో ఉన్న అతిరప్పిల్లి వాటర్‌ఫాల్స్‌కు బయల్దేరతారు. వాటర్ ఫాల్స్ చూసుకుని తర్వాత కొచ్చి బయల్దేరతారు. కొచ్చిలో మెరైన్ డ్రైవ్ ఎంజాయ్ చేసి రాత్రి 11.55 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ మ్యాజిక్ ఆఫ్ మలబార్ టూర్ ప్యాకేజీ ధరలు.. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో రూ.27,100, డబుల్ ఆక్యుపెన్సీలో రూ.28,150, సింగిల్ ఆక్యుపెన్సీలో రూ.24,000గా ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.

First Published:  30 Sept 2023 10:26 AM GMT
Next Story