Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ రాజస్థాన్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..

విశాలమైన ఎడారి, అందమైన కోటలు, ప్యాలెస్‌లు.. ఇలా బోలెడన్ని వింతలకు రాజస్థాన్ కేరాఫ్ అడ్రెస్. అలాంటి రాజస్థాన్‌లోని ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ ఐఆర్‌‌సీటీసీ ఓ టూర్ ప్యాకేజ్ రెడీ చేసింది.

ఐఆర్‌‌సీటీసీ రాజస్థాన్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..
X

ఐఆర్‌‌సీటీసీ రాజస్థాన్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..

విశాలమైన ఎడారి, అందమైన కోటలు, ప్యాలెస్‌లు.. ఇలా బోలెడన్ని వింతలకు రాజస్థాన్ కేరాఫ్ అడ్రెస్. అలాంటి రాజస్థాన్‌లోని ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ ఐఆర్‌‌సీటీసీ ఓ టూర్ ప్యాకేజ్ రెడీ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ హెరిటేజ్‌కు అద్దం పట్టేలా ఎన్నో కట్టడాలు రాజస్థాన్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లోని నగరాలను రాయల్ సిటీస్ అంటుంటారు. అలాంటి రాయల్ నగరాలను చూడాలనుకునేవారికోసం ఐఆర్ సీటీసీ.. ‘రాయల్‌ రాజస్థాన్‌’ పేరుతో టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్‌‌లో భాగంగా జైపూర్‌, ఉదయ్‌పూర్‌, జోధ్‌పూర్‌ వంటి పలు నగరాలను సందర్శించొచ్చు. ఐదు రాత్రులు, ఆరు పగళ్లతో ఉండే ఈ టూర్‌ సెప్టెంబర్‌ 10న మొదలవుతుంది. ఇప్పటినుంచే ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు.

టూర్ మ్యాప్ ఇదీ

ఐఆర్‌‌సీటీసీ రాజస్థాన్ టూర్ హైదరాబాద్‌ నుంచి మొదలవుతుంది. ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. అదే రోజు మధ్యాహ్నానికి జైపూర్ చేరుకుంటారు. మొదటిరోజు జైపూర్ లోని అమేర్‌ ఫోర్ట్‌ చూసి రాత్రి హోటల్‌లో స్టే చేస్తారు. రెండో రోజు జైపూర్‌ సిటీ ప్యాలెస్‌ విజిట్, జంతర్‌ మంతర్‌ విజిట్ ఉంటుంది. అదే రోజు లోకల్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక మూడో రోజు జైపూర్‌ నుంచి పుష్కర్‌కు చేరుకుంటారు.

అక్కడ బ్రహ్మ టెంపుల్ సందర్శించి మధ్యాహ్నానికి ఉదయ్‌పూర్‌ బయల్దేరతారు. ఆ రోజు రాత్రి ఉదయ్‌పూర్‌లో స్టే ఉంటుంది. నాలుగో రోజు ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌, సహేలియోన్‌ కీ బరీ, పిచోలా లేక్‌ వంటివి చూస్తారు. ఆ రోజు రాత్రి ఉదయ్‌పూర్‌లో స్టే చేసి మరుసటి రోజు జోధ్‌పూర్ బయల్దేరతారు. ఐదోరోజు జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్, లోకల్ షాపింగ్ వంటివి చూసుకుని రాత్రి జోధ్‌పూర్‌‌లో స్టే చేస్తారు. ఇక ఆరో రోజు జోధ్‌పూర్‌‌లోని మెహ్రాన్‌ఘర్ ఫోర్ట్‌ను చూసి సాయంత్రానికి జోధ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్ చేరుకొని రిటర్న్ ఫ్లైట్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలివీ..

టూర్ ప్యాకేజీలో భాగంగా.. ఫ్లైట్ టికెట్లు, హోటల్ స్టే, ఉదయం, సాయంత్రం భోజనం, లోకల్ సీయింగ్ కోసం ఏసీ బస్సు, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. ఫోర్ట్‌లు, ప్యాలెస్‌ల్లో ఎంట్రీ టికెట్ల ఖర్చు ప్రయాణికులదే.

ప్యాకేజ్‌ ఛార్జీలు

ప్యాకేజీ ధరలు సింగిల్‌ షేరింగ్‌ అయితే రూ.37,750, డబుల్ షేరింగ్‌ అయితే రూ.30,450, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.28,900 గా ఉన్నాయి.

First Published:  10 Aug 2023 10:30 AM IST
Next Story