Telugu Global
Travel

నాగాలాండ్ హార్న్‌బిల్ ఫెస్టివల్ కోసం ఐఆర్‌‌సీటిసీ స్పెషల్ ప్యాకేజీ!

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో జరిగే పాపులర్ ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ చూడాలనుకునేవాళ్ల కోసం ఐఆర్‌‌సీటీసీ ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్‌‌లో భాగంగా కోహిమాలో జరిగే హార్న్‌బిల్ ఫెస్టివల్ ఈవెంట్‌ చూసి రావొచ్చు.

నాగాలాండ్ హార్న్‌బిల్ ఫెస్టివల్ కోసం ఐఆర్‌‌సీటిసీ స్పెషల్ ప్యాకేజీ!
X

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో జరిగే పాపులర్ ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ చూడాలనుకునేవాళ్ల కోసం ఐఆర్‌‌సీటీసీ ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్‌‌లో భాగంగా కోహిమాలో జరిగే హార్న్‌బిల్ ఫెస్టివల్ ఈవెంట్‌ చూసి రావొచ్చు. ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..

నాగాలాండ్‌లో ప్రతిఏటా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకూ ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ అనే కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది. నాగాలాండ్‌లోని గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షించుకోవడంలో భాగంగా ఏటా ఈ ఫెస్టివల్ జరుపుతారు. ఈ ఫెస్టివల్‌లో విభిన్న గిరిజన తెగలకు చెందిన ప్రజలు రంగురంగుల దుస్తులు ధరించి అరుదైన ప్రదర్శనలు చేస్తారు. పాటలు, సాంప్రదాయ నృత్యాలు, యుద్ధాలు, కుస్తీ పోటీలు, ఆటల పోటీల వంటివి ఉంటాయి. వీటితోపాటు చేతి పనిముట్ల ఎగ్జిబిషన్, స్థానిక వంటకాల ప్రదర్శనలు, పెయింటింగ్స్,శిల్పాల వంటి వాటిని స్టాల్స్ రూపంలో ప్రదర్శనకు ఉంచుతారు. టూరిస్టులు ఈ ఫెస్టివల్‌ను చూసి ఎంజాయ్ చేయడంతో పాటు స్థానిక వస్తువులను షాపింగ్ చేయొచ్చు.

ఈ ఈవెంట్‌కు వెళ్లాలనుకునేవాళ్ల కోసం ఐఆర్‌‌సీటీసీ.. ‘ఫ్యాసినేటింగ్ హార్న్‌బిల్ ఫెస్టివల్’ పేరుతో.. 4 రోజులు, 3 రాత్రుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది. అయితే ఈ టూర్ అస్సాంలోని దిమాపూర్ నుంచి మొదలవుతుంది. టూర్ వెళ్లాలనుకునేవాళ్లు ముందుగానే ట్రైన్ లేదా ఫ్లైట్ ద్వారా దిమాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది.

టూర్ షెడ్యూల్ ఇదీ..

మొదటిరోజు దిమాపూర్ ఎయిర్‌‌పోర్ట్ లేదా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో నాగాలాండ్ క్యాపిటల్ కోహిమాకు తీసుకెళ్తారు. మొదటిరోజు రాత్రి కోహిమాలోని హోటల్‌లో స్టే చేస్తారు. రెండో రోజు పొద్దున్నే టిఫిన్ చేసిన తర్వాత హార్న్‌బిల్ ఫెస్టివల్ జరిగే కిసామా విలేజ్‌కి తీసుకెళ్తారు. రెండో రోజంతా అక్కడే ఉంటారు. సంప్రదాయ నాగా గుడిసెల్లో స్టే చేయొచ్చు. టూరిస్టులు ఫెస్టివల్‌తో పాటు దగ్గర్లోని ఇతర ప్రాంతాలను కూడా విజిట్ చేయొచ్చు. మూడో రోజు నాగాలాండ్‌లోని కోనోమా అనే అందమైన విలేజ్‌కి తీసుకెళ్తారు. ఆ రోజంతా అక్కడ స్పెండ్ చేశాక తిరిగి కోహిమా చేరుకుంటారు. నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత దిమాపూర్ ఎయిర్‌‌పోర్ట్ లేదా రైల్వే స్టేషన్‌కి వెహికల్‌లో తీసుకెళ్లడంతో టూర్ ముగుస్తుంది.

ఫ్యాసినేటింగ్ హార్న్‌బిల్ ఫెస్టివల్ టూర్‌‌కు సింగిల్‌గా లేదా గ్రూప్‌గా బుకింగ్స్ చేసుకోవచ్చు. ప్యాకేజీ ధరలు రూ. 20,690 నుంచి మొదలవుతాయి. ఈ ఫెస్టివల్ కోసం నవంబర్ 31 నుంచి డిసెంబర్ 8 వరకు గౌహతి, దిమాపూర్‌‌కు స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకోసం ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్ (www.irctctourism.com) విజిట్ చేయొచ్చు.

First Published:  14 Oct 2023 10:47 AM GMT
Next Story