ఐఆర్‌సీటీసీ కేరళ టూర్.. ప్యాకేజీ వివరాలివే..
IRCTC Kerala Tour from Visakhapatnam: ఆహ్లాదరకరమైన చలికాలంలో కేరళ అందాలను వీక్షించాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ కేరళ టూర్‌ను రెడీ చేసింది. విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ టూర్ ప్యాకేజ్ వివరాలివే.
ఆహ్లాదరకరమైన చలికాలంలో కేరళ అందాలను వీక్షించాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ కేరళ టూర్‌ను రెడీ చేసింది. విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ టూర్ ప్యాకేజ్ వివరాలివే..
కేరళలోని అందమైన ప్రాంతాలన్నింటినీ కవర్ చేస్తూ ఐఆర్ సీటీసీ మెస్మరైజింగ్ కేరళ పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది. విశాఖపట్నం నుంచి బయల్దేరే ఈ టూర్‌లో కేరళలోని కొచ్చి, మున్నార్, అలెపీ, కుమారకోమ్, త్రివేండ్రం ప్లేసులు కవర్ అవుతాయి. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు సాగే ఈ టూర్ .. అక్టోబర్ 14న మొదలవుతుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
మొదటిరోజు ఉదయం 7.40 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కడంతో టూర్ మొదలవుతుంది. అదేరోజు మధ్యాహ్నానికి కొచ్చి చేరుకుంటారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాక సాయంత్రం కొచ్చిలో మెరైన్ డ్రైవ్, బోటింగ్ వంటివి ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి కొచ్చిలో స్టే చేసి.. రెండో రోజు కొచ్చిలోని డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రూజ్ బాసిలికా వంటివి చూడొచ్చు. ఆ తర్వాత మున్నార్ బయల్దేరతారు. అదేరోజు రాత్రికి మున్నార్‌లో స్టే ఉంటుంది. మూడో రోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండల లేక్, పునర్జని కల్చరల్ విలేజ్ వంటివి చూస్తారు. ఆ రోజు రాత్రి మున్నార్‌లో స్టే ఉంటుంది.
ఇక నాలుగో రోజు ఉదయం అలెపీ బయల్దేరతారు. అలెపీలోని హౌజ్‌బోట్‌లో క్రూజ్ చేసి రాత్రికి అదే బోట్‌లో స్టే చేస్తారు. ఐదో రోజు ఉదయాన్నే త్రివేండ్రం బయల్దేరతారు. అక్కడ అరిమల ఆలయం, కోవలం బీచ్ చూసి రాత్రికి కోవలంలో స్టే చేస్తారు. ఆరో రోజు ఉదయం అనంత పద్మనాభస్వామి అలయం చూసుకుని రిటర్న్ ఫ్లైట్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. ప్యాకేజీ ధరలు.. ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.38,110, డబుల్ షేరింగ్‌కి రూ.40,925, సింగిల్ షేరింగ్‌కి రూ.56,635 గా ఉన్నాయి.