ఐఆర్‌సీటీసీ గోవా టూర్.. ప్యాకేజీ వివరాలివే..
రాబోయే వింటర్‌లో గోవా టూర్ ప్లాన్ చేసేవాళ్ల కోసం ఐఆర్‌సీటీసీ.. ‘గోవా రిట్రీట్’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది.
రాబోయే వింటర్‌లో గోవా టూర్ ప్లాన్ చేసేవాళ్ల కోసం ఐఆర్‌సీటీసీ.. ‘గోవా రిట్రీట్’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ వెళ్లాలనుకునేవాళ్లకోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్.. మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు ఉంటుంది. టూర్ లో భాగంగా సౌత్ గోవా, నార్త్ గోవాలోని పలు పర్యాటక ప్రాంతాలు కవర్ చేయొచ్చు. అక్టోబర్ 12, నవంబర్ 2, నవంబర్ 30 తేదీల్లో ఈ టూర్ ఉంటుంది.
ప్రయాణం ఇలా..
ఐఆర్‌సీటీసీ గోవా రిట్రీట్ టూర్.. మొదటి రోజు హైదరాబాద్‌లో మొదలవుతుంది. మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 2 గంటలకు గోవా చేరుకుంటారు. తర్వాత హోటల్‌లో కాసేపు రెస్ట్ తీసుకుని గోవాలో ఉన్న జువారీ రివర్‌ను విజిట్ చేస్తారు. రాత్రికి హోటల్ చేరుకుని అక్కడే స్టే చేస్తారు.
రెండో రోజు ఉదయాన్నే సౌత్ గోవాలో ఉన్న ఓల్డ్ గోవా చర్చి, బసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చి, పోర్ట్‌రైట్ గ్యాలరీ, ఆర్కియలాజికల్ మ్యూజియం, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, మంగేషీ ఆలయం వంటివి చూసుకుని మిరామర్ బీచ్‌కు వెళ్తారు. తర్వాత మండోవి నదిపై బోట్ క్రూజ్ చేసి రాత్రికి హోటల్ చేరుకుంటారు.
మూడో రోజు నార్త్ గోవాలోని అగ్వాడా ఫోర్ట్, క్యాండోలిమ్ బీచ్, బాగా బీచ్ వంటివి చూడొచ్చు. కావాలనుకుంటే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ చూసి రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు. ఇక నాలుగో రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గోవాలో రిటర్న్ ఫ్లైట్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ గోవా టూర్ ప్యాకేజీ ధరలు.. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కరికి రూ.21,805, డబుల్ ఆక్యుపెన్సీలో రూ.21,930, సింగిల్ ఆక్యుపెన్సీలో రూ.27,560గా ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వెహికల్‌లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. గోవాలో వాటర్ స్పోర్ట్స్ వంటివాటికి ఛార్జీలు ప్రయాణికులే చూసుకోవాలి.