Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ మాన్‌సూన్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..

మొదటి రోజు హైదరాబాద్‌ లో టూర్ మొదలవుతుంది. అదే రోజు అహ్మదాబాద్‌కి ఫ్లైట్‌లో చేరుకుంటారు. తర్వాత సబర్మతి ఆశ్రమం, అదాలజ్ స్టెప్ వెల్, అక్షరధామ్ లాంటి ప్రాంతాలు సందర్శిస్తారు.

ఐఆర్‌‌సీటీసీ మాన్‌సూన్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..
X

ఐఆర్‌‌సీటీసీ మాన్‌సూన్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..

వర్షాకాలంలో పర్యాటక ప్రదేశాలు చూడ మనోహరంగా కనిపిస్తాయి. అందుకే మాన్‌సూన్‌లో హిల్ స్టేషన్స్, టెంపుల్స్ లాంటి వాటికి ఎక్కువగా టూర్స్ వేస్తుంటారు చాలామంది. అయితే మాన్‌సూన్‌లో టూర్ వెళ్లాలనుకునేవాళ్ల కోసం ఐఆర్‌‌సీటీసీ ‘సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో ఓ టూర్‌‌ను తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ఎలా ఉంటుందంటే..

మాన్‌సూన్ సీజ‌న్‌లో ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ, అహ్మదాబాద్, రాజ్‌కోట్, వడోదర వంటి ప్రాంతాల‌ను కవర్ చేస్తూ.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ టూర్ సెప్టెంబర్ 10న‌ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ద్వారా మొదలవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో ద్వారకా, సోమనాథ్, లాంటి అధ్యాత్మిక ప్రదేశాలతో రాజ్‌కోట్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా సందర్శించొచ్చు. ఈ టూర్ 6 రాత్రులు, 7 రోజుల పాటు సాగుతుంది.

మొదటి రోజు హైదరాబాద్‌ లో టూర్ మొదలవుతుంది. అదే రోజు అహ్మదాబాద్‌కి ఫ్లైట్‌లో చేరుకుంటారు. తర్వాత సబర్మతి ఆశ్రమం, అదాలజ్ స్టెప్ వెల్, అక్షరధామ్ లాంటి ప్రాంతాలు సందర్శిస్తారు. రెండో రోజు ఉద‌యం ద్వారకా చేరుకుంటారు. తర్వాత రాజ్‌కోట్ చూసుకుని మూడోరోజు బెట్ ద్వారకా ఐలాండ్ సంద‌ర్శన‌కు వెళ్తారు. అదేరోజు నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కూడా ఉంటుంది. ఇక నాలుగో రోజు సోమ్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకుని ఐదో రోజు వడోదరకు చేరుకుంటారు. అక్కడ లోకల్ సైట్ సీయింగ్ చేసి చివరిగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శిస్తారు. ఏడో రోజు అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యి, రాత్రికి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

సౌరాష్ట్ర విత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టూర్ ప్యాకేజీ ధరలు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.42,950, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.32,850, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 31,550గా ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్ టికెట్స్, హోటల్‌ స్టే , బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌లు కవర్ అవుతాయి.

First Published:  18 July 2023 2:38 PM IST
Next Story