Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్.. ప్యాకేజీ వివరాలివే..

కర్నాటకలోని ఉడిపి, ధర్మస్థల వంటి పుణ్యక్షేత్రాలతో పాటు కోస్టర్ కర్నాటకను ఎక్స్‌ప్లోర్ చేసే విధంగా కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్’.

ఐఆర్‌‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్.. ప్యాకేజీ వివరాలివే..
X

ఐఆర్‌‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్.. ప్యాకేజీ వివరాలివే..

కర్నాటకలోని ఉడిపి, ధర్మస్థల వంటి పుణ్యక్షేత్రాలతో పాటు కోస్టర్ కర్నాటకను ఎక్స్‌ప్లోర్ చేసే విధంగా కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్’. ఈ టూర్ ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..

కర్నాటక సముద్ర తీరంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ.. ఐఆర్‌‌సీటీసీ డివైన్ కర్నాటక పేరుతో టూర్ ప్యాకేజీని రెడీ చేసింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుటుంది. టూర్‌‌లో భాగంగా ఉడుపి, కుక్కి, శృంగేరి, ధర్మస్థల, మంగళూరు వంటి ప్రాంతాలు చూసిరావొచ్చు. ఈ టూర్.. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు సాగుతుంది. హైదరాబాద్ నుంచి ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 8 వ తేదీకి ఇప్పటినుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.

ప్రయాణం ఇలా..

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6.05 గంటలకు మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడంతో ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్ మొదలవుతుంది. మొదటి రోజంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరుకి చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడుపి బయల్దేరతారు. అక్కడ సెయింట్ మేరీస్ ఐల్యాండ్, మాల్పే బీచ్ చూసి రాత్రికి ఉడుపిలో స్టే చేస్తారు. మూడో రోజు ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకుని తర్వాత శృంగేరి బయల్దేరతారు. అక్కడ శారదాంబ పీఠాన్ని దర్శించుకుని తర్వాత మంగళూరు బయల్దేరతారు. ఆ రోజు రాత్రికి మంగళూరులో స్టే చేస్తారు. నాలుగో రోజు ఉదయం ధర్మస్థల వెళ్లి అక్కడ మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుని, తర్వాత కుక్కివెళ్తారు. కుక్కిలో సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత తిరిగి మంగళూరు బయల్దేరతారు. ఐదో రోజు మంగళూరులో నిసర్గధామ, మంగళదేవి ఆలయం, కటీల్ ఆలయం, తన్నీర్‌బావి బీచ్ వంటివి చూసుకుని రాత్రికి రిటర్న్ ట్రైన్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

డివైన్ కర్నాటక టూర్ ప్యాకేజీ ధరలు.. కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.15,420, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,160, స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,420, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,160గా ఉన్నాయి.

ప్యాకేజీలో భాగంగా ఏసీ రైలు ప్రయాణం, స్టాండర్డ్ క్లాస్‌ అయితే స్లీపర్ క్లాస్ ప్రయాణం, ఏసీ హోటల్‌లో స్టే, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.

First Published:  8 Sept 2023 9:30 AM IST
Next Story