Telugu Global
Travel

ట్రైన్ టికెట్ మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు! ఎలాగంటే..

ఒకసారి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాక చివరి నిముషంలో ట్రిప్ క్యాన్సిల్ అయితే.. టికెట్ వృథాగా పోతుంది. ఒకవేళ ముందుగానే టికెట్ క్యాన్సిల్ చేసినా కొంత మొత్తం మాత్రమే రీఫండ్ వస్తుంది. అయితే రైల్వే శాఖ తీసుకొచ్చిన కొత్త ఫెసిలిటీతో బుక్ చేసిన టికెట్‌ను మరొకరి పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

ట్రైన్ టికెట్ మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు! ఎలాగంటే..
X

ట్రైన్ టికెట్ మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు! ఎలాగంటే..

ఒకసారి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాక చివరి నిముషంలో ట్రిప్ క్యాన్సిల్ అయితే.. టికెట్ వృథాగా పోతుంది. ఒకవేళ ముందుగానే టికెట్ క్యాన్సిల్ చేసినా కొంత మొత్తం మాత్రమే రీఫండ్ వస్తుంది. అయితే రైల్వే శాఖ తీసుకొచ్చిన కొత్త ఫెసిలిటీతో బుక్ చేసిన టికెట్‌ను మరొకరి పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇదెలా పనిచేస్తుందంటే..

ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేయడానికి బదులు వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండియన్ రైల్వే శాఖ. అయితే ఈ సదుపాయం కేవలం ఫ్యామిలీ మెంబర్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంటే మీరు బుక్ చేసిన టికెన్ ను మీ తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, కుమారుడు, కుమార్తె, భార్య, భర్త.. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. అలాగే ఆన్‌డ్యూటీలో ప్రయాణాలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు తమ టికెట్‌ను తోటి ఉద్యోగికి బదిలీ చేసుకోవచ్చు.

టికెట్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం కేవలం ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిన వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. టికెట్ కన్ఫర్మ్ అయిన వాళ్లు రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు ప్రయాణాన్ని ఇతరుల పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయమని రైల్వే శాఖకు అర్జీ పెట్టుకోవచ్చు. అప్పుడు మీ టికెట్‌ను మీరు కోరుకున్న వాళ్లకు బదిలీ చేస్తారు. దానికిగానూ రైల్వే స్టేషన్‌కు వెళ్లి అవతలివాళ్ల డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ టికెట్ ద్వారా ప్రయాణించే వాళ్లు వెంట ఐడెంటిటీ కార్డుని తీసుకెళ్లాలి. టికెట్ ట్రాన్స్ ఫర్ సదుపాయం కేవలం ఒకసారి మాత్రమే కుదురుతుంది. ఒకసారి ట్రాన్స్‌ఫర్ అయ్యాక మళ్లీ వేరొకరికి బదిలీ చేయడం కుదరదు.

ప్రాసెస్ ఇలా..

ముందుగా కన్ఫర్మ్‌ అయిన టికెట్‌ను ప్రింట్‌ తీసి పెట్టుకోవాలి. ఎవరి పేరు మీద టికెట్‌ను బదిలీ చేయాలనుకుంటున్నారో వాళ్ల ఆధార్‌ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుని తీసుకుని దగ్గర్లోని రైల్వేస్టేషన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌కు వెళ్లాలి. అక్కడ టికెట్ ట్రాన్స్‌ఫర్ కోసం అర్జీ పెట్టుకోవాలి. మీ గుర్తింపు కార్డు, అవతలి వారి వివరాలు ఇస్తే.. అధికారులు టికెట్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

First Published:  17 Oct 2023 5:08 PM IST
Next Story