Telugu Global
Travel

సిటీకి దగ్గర్లో ఉన్న కన్హా ఫారెస్ట్ గురించి తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ హాల్.. హైదరాబాద్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుసా? ఇక్కడ పచ్చని ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు ధ్యానం చేస్తూ ప్రశాంతతను పొందొచ్చు.

సిటీకి దగ్గర్లో ఉన్న కన్హా ఫారెస్ట్ గురించి తెలుసా?
X

సిటీకి దగ్గర్లో ఉన్న కన్హా ఫారెస్ట్ గురించి తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ హాల్.. హైదరాబాద్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుసా? ఇక్కడ పచ్చని ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు ధ్యానం చేస్తూ ప్రశాంతతను పొందొచ్చు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఉన్న కన్హా శాంతివనం.. సిటీకి 50 కిలమీటర్లో దూరంలో ఉంది. ఇది 30 ఎకరాల్లో నిర్మించిన అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. ఇక్కడ 40 వేల మందికి పైగా బసచేసేందుకు వసతి ఏర్పాట్లు ఉన్నాయి. ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసేందుకు వీలుగా హాల్స్ నిర్మించారు. ఒక సెంట్రల్‌ హాల్‌తో పాటు ఎనిమిది సెకండరీ హాళ్లు ఉంటాయి.

అంతేకాదు ఈ హాల్ చుట్టూ 1400 ఎకరాల్లో మానవ నిర్మిత అడవి ఉంది. లక్షలాది పచ్చని చెట్లతోపాటు పెద్దపెద్ద లైబ్రరీలు, మెడిటేషన్ హాల్స్ ఉన్నాయి. తమిళనాడు, కేరళ, అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల నుంచి పలు అరుదైన వృక్ష జాతులను తెచ్చి ఇక్కడ సంరక్షిస్తున్నారట.

ఇక్కడ కేరళ జామూన్ వంటి పలురకాల అరుదైన చెట్ల జాతులను చూడొచ్చు. ఈ వనంలో మొత్తంగా ఏడు లక్షల చెట్లు ఉన్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ వనంలోకి వెళ్తే.. దట్టమైన అడవిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఉండే బుద్ధుని విగ్రహం దగ్గర నిలబడి శబ్దం చేస్తే.. ఆ శబ్దం తిరిగి పదిసార్లు ప్రతిధ్వనించేలా నిర్మాణాలు కట్టారు.

వీకెండ్ సరదాగా గడిపి రావడానికి ఈ ప్లేస్ మంచి ఆప్షన్. వనంలో.. చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్, క్యాంటీన్ వంటివి ఉన్నాయి. పెద్దపెద్ద మెడిటేషన్ హాల్స్‌లో కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి రావొచ్చు.

First Published:  3 Oct 2023 4:13 PM IST
Next Story