ముసురు వేళలో వెళ్లాల్సిన బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే..
జల్లులు కురిసే సమయంలో హిల్ స్టేషన్స్ చూడమనోహరంగా ముస్తాబవుతాయి. అందుకే జులై, ఆగస్టు నెలల్లో టూర్ ప్లాన్ చేసేవాళ్లు మంచి హిల్ స్టేషన్స్‌ను ఎంచుకోవచ్చు
జల్లులు కురిసే సమయంలో హిల్ స్టేషన్స్ చూడమనోహరంగా ముస్తాబవుతాయి. అందుకే జులై, ఆగస్టు నెలల్లో టూర్ ప్లాన్ చేసేవాళ్లు మంచి హిల్ స్టేషన్స్‌ను ఎంచుకోవచ్చు. హిల్ స్టేషన్స్ సముద్రమట్టానికి ఎంతో ఎత్తులో ఉండడం వల్ల వాతావరణం మరీ చల్లగా ఉండడంతో పాటు మబ్బులు చేతికందేంత ఎత్తులో ఉంటాయి. మరి మనకు దగ్గర్లో అందమైన హిల్ స్టేషన్స్ ఎక్కడున్నాయో చూద్దామా?
అందమైన హిల్ స్టేషన్స్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు మన సౌత్ ఇండియాలోనే బోలెడు హిల్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిలో తమిళనాడులోని ఊటీ బెస్ట్ ఆప్షన్. ఇది హనీమూన్ డెస్టినేషన్‌గా ఫేమస్. ఈ సీజన్‌లో ఈ ప్రాంతమంతా పచ్చని కొండలు, నల్లటి మబ్బులు, చల్లని గాలులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
కేరళలోని మున్నార్ చాలామందికి ఫేవరెట్. ఇక్కడి అందాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అందమైన టీ ఎస్టేట్స్‌తో నిండి ఉండే ఈ హిల్ స్టేషన్.. సముద్రమట్టానికి 1532 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఇక్కడ రకరకాల అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసేందుకు కూడా వీలుంది.
తమిళనాడు, కేరళ బోర్డర్‌లో ఉండే కొడైకెనాల్ కూడా బెస్ట్ మాన్‌సూన్ డెస్టినేషన్. సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఉండే కొడైకెనాల్.. సరస్సులు, పచ్చని కొండలతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఇక్కడ తరచూ జల్లులు కురుస్తుంటాయి.
మాన్‌సూన్‌లో చల్లని చిరుజల్లుల మధ్య ట్రెక్కింగ్ చేయాలంటే కర్నాటకలోని కుదేర్ ముఖ్ బెస్ట్ ఛాయిస్. చిక్‌మగళూర్‌కు దగ్గర్లో ఉండే ఈ హిల్ స్టేషన్ ఎత్తైన కొండలతో చూడమనోహరంగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్లు తగిన జాగ్రత్తలతో బయలుదేరాలి.
తమిళనాడులోని ఆర్కాడ్ హిల్ స్టేషన్.. వర్షాకాలం రాగానే అందమైన సరస్సులు, వాటర్ ఫాల్స్‌తో అబ్బురపరుస్తుంది. ఇక్కడుండే ఎమరాల్డ్ లేక్ దేశంలోని అందమైన సరస్సుల్లో ఒకటి. పచ్చని కొండలు, ఫ్లవర్ వ్యాలీస్ తో ఉండే ఆర్కాడ్ ఈ సీజన్ లో మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.
వీటితోపాటు కేరళలోని వయానాడ్ కూడా ఈ సీజన్‌లో వెళ్లదగిన బెస్ట్ ప్లేస్‌ల్లో ఒకటి. ఇక్కడ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేయడంతోపాటు వైల్డ్‌లైఫ్‌ను కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు.