18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు
యాదగిరిగుట్ట దేవాలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ వెల్లడి
BY Raju Asari18 March 2025 5:57 PM IST

X
Raju Asari Updated On: 18 March 2025 5:57 PM IST
యాదగిరిగుట్ట దేవాలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు ఉంటుందన్నారు. బోర్డు పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించామన్నారు. బోర్డు ఛైర్మన్, సభ్యులకు ఎలాంటి జీత భత్యాలు ఉండవన్నారు. వైటీడీ బోర్డు విద్యా సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించవచ్చు. బోర్డుకు బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం ఆమోదం ద్వారానే జరుగుతుంది. ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Next Story