నేనేం తక్కువ తిన్నానా..? విజయమ్మ రెండు చెంప దెబ్బలు
ఉదయం షర్మిల, మహిళా కానిస్టేబుల్ ని చెంపదెబ్బ కొట్టి, ఎస్సైని పక్కకు తోసేశారు. కాసేపటికే షర్మిల తల్లి విజయమ్మ కూడా అదే సీన్ రిపీట్ చేశారు. ఆమె పోలీస్ స్టేషన్ ముందే పోలీసుల్ని కొట్టడం విశేషం.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు ఉన్నట్టుండి ఒకే రోజు ఫ్రస్టేషన్ పీక్స్ కి వెళ్లిపోయినట్టయింది. పోలీసులు హుందాగా వ్యవహరిస్తున్నా కూడా కావాలనే వారిద్దరూ రెచ్చిపోయారు, ఎగిరెగిరి పడ్డారు. పోలీసులపై చేయి చేసుకున్నారు.
ఉదయం పోలీసులపై చేయి చేసుకున్నందుకు షర్మిలను అరెస్ట్ చేశారు. ఆమెను పరామర్శించేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన విజయమ్మ కూడా అదే సీన్ క్రియేట్ చేశారు. ఏయ్ నన్ను తాకొద్దు, నన్ను ముట్టుకుంటే బాగోదు అంటూ వేలు చూపిస్తూ మహిళా పోలీసుల్ని హెచ్చరించారు విజయమ్మ. చివరకు ఆమెను, ఆమె కార్ లోనే ఇంటికి తరలిస్తామని పోలీసులు చెప్పినా వినలేదు. కారులో కూర్చోబెట్టేందుకు మహిళా పోలీసులు ప్రయత్నించే సమయంలో విజయమ్మ ఆవేశానికి గురయ్యారు. మహిళా పోలీసులను చెంపదెబ్బలు కొట్టారు.
షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరామర్శకోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన విజయమ్మను పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో ఆమె అక్కడే ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహిళా కానిస్టేబుల్ పై విజయమ్మ చేయిచేసుకున్నారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతుంటే ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారని విజయమ్మ ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. ఈ క్రమంలో వాహనంలో ఎక్కేందుకు నిరాకరించిన విజయమ్మ.. మహిళా కానిస్టేబుళ్లను చెంపదెబ్బలు కొట్టడం సంచలనంగా మారింది.
ఉదయం షర్మిల, మహిళా కానిస్టేబుల్ ని చెంపదెబ్బ కొట్టి, ఎస్సైని పక్కకు తోసేశారు. కాసేపటికే షర్మిల తల్లి విజయమ్మ కూడా అదే సీన్ రిపీట్ చేశారు. ఆమె పోలీస్ స్టేషన్ ముందే పోలీసుల్ని కొట్టడం విశేషం. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లీ కూతుళ్లిద్దరూ ఫ్రస్టేషన్లో ఉన్నారని, తెలంగాణలో రాజకీయాలు చేయలేమని తేలిపోయే సరికి ఇలా కోపంలో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.