Telugu Global
Andhra Pradesh

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల ఇవాళ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులో ఆమె విజయవాడ బస్ స్టాండ్‌ నుంచి తెనాలి వరకు ప్రయాణం చేశారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన  వైఎస్ షర్మిల
X

విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. బస్సులో విజయవాడ నుంచి బస్ స్టాండ్‌ నుంచి తెనాలి వరకు ఆమె ప్రయాణం చేశారు. కూటమి సర్కార్ వచ్చి నాలుగు నెలలు అయింది. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీ బస్సు ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారు. తెలంగాణలో వారంలో అమలు చేశారు. కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో నిత్యం 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని ఆమె అన్నారు. బస్సులో సాటి ప్రయాణికులతో ఆమె ముచ్చటించారు.

ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం అవసరమా.. లేదా..? అని మహిళలను ప్రశ్నించారు. పలువురు మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ ఫ్రీ బస్‌ సౌకర్యం కావాలనే చెప్పారు. రోజు మహిళల ద్వారా రూ.7-10 కోట్లు అంటే నెలకు రూ.300 కోట్లు ఆదాయం వస్తుంది. ఉచిత ప్రయాణం కల్పిస్తే..ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది అని భయమని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీల్లో 4 పతకాలు మహిళలవే. ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు. ఇలాంటి తక్కువ ఖర్చు పథకం కూడా మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదాని షర్మిల అన్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి. మహిళలకు భరోసా కావాలి. మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపిస్తున్నామని షర్మిల తెలిపారు.

First Published:  18 Oct 2024 4:10 PM IST
Next Story