మహారాష్ట్రలో బీఆర్ఎస్.. షర్మిలకు కడుపు మంట
మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలపడటం తెలంగాణలోని వైరి వర్గాలకు కంటగింపుగా మారింది. అందుకే ఇలాంటి స్టేట్ మెంట్లతో అక్కసు వెళ్లగక్కారు వైఎస్ షర్మిల.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత పొరుగు రాష్ట్రం మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కేసీఆర్. మహారాష్ట్రలో బీఆర్ఎస్ నేతల శిక్షణ శిబిరం ఈరోజుతో ముగుస్తుంది. ఈలోగా అక్కడి పంచాయతీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ బోణీకూడా కొట్టింది. దీంతో ఇక్కడి ప్రతిపక్షాలకు మంటెక్కింది. తెలంగాణతోపాటు, మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరుతుందనే సంకేతాలు వెలువడటంతో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు.
తెలంగాణ అభివృద్ధి మోడల్ ని చూపించి మహారాష్ట్రలో బీఆర్ఎస్ పట్ల నాయకులు, ప్రజలు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు కేసీఆర్. లేనివి ఉన్నట్టు చెప్పాల్సిన పని లేదు, తెలంగాణ అభివృద్ధి సరిహద్దు ప్రాంతాల వారి కళ్లకు కట్టేలా ఉంది. దీంతో ప్రజల మౌత్ టాక్ తోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కి క్రేజ్ పెరిగింది. అయితే తెలంగాణ మోడల్ ని కించపరిచేలా మాట్లాడుతూ షర్మిల తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రైతులకు అసెంబ్లీ టికెట్లు ఇస్తామంటున్న బీఆర్ఎస్ హామీపై మండిపడ్డారామె.
తెలంగాణలో కూడా బీఆర్ఎస్.. రైతులకే అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు షర్మిల. రైతునే ముఖ్యమంత్రిని చేయాలంటూ వితండవాదానికి దిగారు. షర్మిల వాదన ఎలా ఉన్నా.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ముద్ర బలంగా పడుతోందనే విషయం ఇలాంటి కడుపుమంట స్టేట్ మెంట్ల వల్ల బహిరంగమవుతోంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలపడటం తెలంగాణలోని వైరి వర్గాలకు కంటగింపుగా మారింది. అందుకే ఇలాంటి స్టేట్ మెంట్లతో అక్కసు వెళ్లగక్కారు వైఎస్ షర్మిల.