Telugu Global
Telangana

షర్మిలకు బెయిల్.. ఇప్పుడైనా సారీ చెబుతారా..?

కారు ఎక్కొద్దు, బయటకు వెళ్లొద్దు అని చెప్పినందుకే మహిళా కానిస్టేబుల్ ని చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టారు షర్మిల. షర్మిలకు నాంపల్లి కోర్టు 2వారాల రిమాండ్ విధించింది. ఈరోజు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

YS Sharmila Granted Conditional Bail By Nampally Court in Hyderabad
X

YS Sharmila: షర్మిలకు బెయిల్.. ఇప్పుడైనా సారీ చెబుతారా..?

పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30వేల రూపాయల పూచీకత్తుతో ఇద్దరు జామీను సమర్పించాలని కోరింది. విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని షరతు విధించింది. జైలునుంచి బయటకు వచ్చిన షర్మిల కనీసం ఇప్పుడైనా మహిళా పోలీసుకి క్షమాపణ చెబుతారా లేదా అనేది తేలాల్సి ఉంది.

రివర్స్ అటాక్..

మహిళా కానిస్టేబుల్ ని చెంపదెబ్బ కొట్టడంతోపాటు, విధి నిర్వహణలో ఉన్న ఎస్సైని పక్కకు తోసేసిన షర్మిలపై పోలీసులు కేసు పెట్టారు. కోర్టులో కూడా ఆమె తన తప్పేమీ లేదని వాదించడం విశేషం. తనపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని, ఆత్మరక్షణకోసమే తాను వారితో పోరాడాల్సి వచ్చిందని చెప్పారామె. అయితే అప్పటికే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కారు ఎక్కొద్దు, బయటకు వెళ్లొద్దు అని చెప్పినందుకే మహిళా కానిస్టేబుల్ ని చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టారు షర్మిల. ఫ్రస్టేషన్లో ఎస్సైపై కూడా చేయి చేసుకున్నారు. విజయమ్మ కూడా పోలీస్ స్టేషన్ వద్ద మహిళా కానిస్టేబుల్ ని చెంపదెబ్బ కొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో షర్మిలకు నాంపల్లి కోర్టు 2వారాల రిమాండ్ విధించింది. ఈరోజు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

షర్మిలపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్న నేపథ్యంలో సిట్ కార్యాలయానికి వెళ్లి ఆమె గందరగోళం చేస్తారనే అనుమానం ఉండటంతో ఇంటి దగ్గరే నిలువరించాలని ప్రయత్నించారు పోలీసులు. కానీ ఆమె పోలీసుల ఆదేశాలు పాటించలేదు. వారిని తోసుకుంటూ వెళ్లి కారెక్కే ప్రయత్నం చేశారు. అడ్డొచ్చిన మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. సోషల్ మీడియాలో షర్మిల చర్యలను తీవ్రంగా ఖండించారు నెటిజన్లు. ఇంత రాద్ధాంతం జరిగినా కోర్టులో మాత్రం ఆమె తన తప్పు ఒప్పుకోలేదు. ఇప్పుడు బెయిల్ పై విడుదలైన తర్వాత కనీసం ఆ మహిళా కానిస్టేబుల్ కి షర్మిల సారీ చెబుతారో లేదో చూడాలి.

First Published:  25 April 2023 2:41 PM IST
Next Story