Telugu Global
Telangana

జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షర్మిల

''ఒక్కొక్కరు ఒక్కోసారి ఒక పేరు పెడుతూ వెళ్తే ఎవరు ఏది ప్రతిపాదిస్తారో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది'' అని షర్మిల వ్యాఖ్యానించారు.

జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షర్మిల
X

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడాన్ని వైఎస్‌ షర్మిల తప్పుపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ షర్మిల ఒక మీడియా ఛానల్‌ వద్ద ఈ అంశంపై మాట్లాడారు.

యూనివర్శిటీకి పేరు మార్చడాన్ని మీరు ఎలా చూస్తారని ప్రశ్నించగా...''అలా మార్చకూడదు. అలా చేస్తే దానికి ఉన్న పవిత్రత పోతుంది. ఒక పేరు పెట్టాక దాన్ని కొనసాగించాలి. అలా చేసినప్పుడే మహనీయులను గౌరవించినట్టు అవుతుంది. లేనిపోని గందరగోళాన్ని తొలగించినట్టు అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కోసారి ఒక పేరు పెడుతూ వెళ్తే ఎవరు ఏది ప్రతిపాదిస్తారో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది'' అని షర్మిల వ్యాఖ్యానించారు.

వైఎస్‌ఆర్‌ పేరు వాడుకునే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాంగ్రెస్‌కు వైఎస్‌ పేరు గుర్తుకు వస్తుందని ఆమె విమర్శించారు. వైఎస్‌ మరణంపై సరైన దర్యాప్తు కూడా చేయించని వారు, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు చేర్చిన వారు ఇప్పుడు వైఎస్‌ తమ వాడు అని ఎలా చెప్పుకుంటారని షర్మిల ప్రశ్నించారు.

First Published:  22 Sept 2022 8:29 AM IST
Next Story