Telugu Global
Telangana

జవాన్ ప్రాణం తీసిన లవ్ ప్రపోజల్

. అక్కడే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జవాన్ ప్రాణం తీసిన లవ్ ప్రపోజల్
X

వికారాబాద్ జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంట చింటూ అనే వ్యక్తి గుండాల్‌ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు ఆమెకు చెప్పాడు. విషయాన్ని యువతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆగ్రహానికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులు చింటూను కొట్టేందుకు ప్రయత్నించారు. అతని తల్లిదండ్రుల్ని సైతం బెదిరించారు.

ఉద్యోగానికి ఎలా పోతావ్ అంటూ చింటూపై బెదిరింపులకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన చింటూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. పొలం వద్దకు వెళ్లి ' మిస్‌ యూ నాన్న, పరువు పోయింది' అంటూ తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు. అక్కడే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2023లో ఇండియన్ ఆర్మీలో చేరిన చింటూ బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకుని సెలవుల మీద ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఇతనికి గుజరాత్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. జూలై 3న తిరిగి వెళ్లేలోపు ఈ ఘటన జరిగింది.

First Published:  26 Jun 2024 8:38 PM IST
Next Story