దబాయింపులు, హెచ్చరికలతో ఎక్కువకాలం ప్రభుత్వాన్ని నడుపలేరు
హైదరాబాద్‌లోని నాలాల విస్తరణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడి
హైదరాబాద్‌లోని నాలాల విస్తరణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, నితిన్ గడ్కరీని కలిసిన ఈటల రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలుగా సహకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కువమందికి డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వాలని మంత్రులకు విజ్ఞప్తి చేశామన్నారు. చెరువులను విస్తరించి సుందరీకరణ పనులు చేపట్టాలని కేంద్రాన్ని కోరామన్నారు. హైవేలు, రేల్వే, అర్బన్ హౌసింగ్‌కు కేంద్రం నిధులు ఇస్తున్నదని ఈటల తెలిపారు. రేవంత్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా చర్యలతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. దబాయింపులు, హెచ్చరికలతో ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడుపలేరని హెచ్చరించారు.
హైదరాబాద్ గొప్పతనం, వాతారణాన్ని కాపాడాలంటే చెరువుల్లోకి వచ్చే మురుగునీటిని మళ్లించి వాటిని మంచినీటిగా చెరువులుగా మార్చడానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రులను కోరామన్నారు. అలాగే ఈ చెరువుల్లో ఈ మురుగు నీరే కాకుండా అనేక నాలాలు అక్రమించబడినాయని ప్రభుత్వం చెబుతున్నది. వాటికి స్టాటిజికల్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద నిర్మాణాలు ఇప్పటికే అమలవుతున్నది.. రోడ్ల కింది నుంచి వర్షం నీళ్లు తీసుకెళ్లే కాలువలు, ఎక్కడా ఇండ్లు కూల్చివేయకుండా , ఎక్కడా గుంట భూమి ఆక్రమించడానికి వీల్లేకుండా.. ఉన్న రోడ్ల కింద స్టాటిజికల్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇంకా మిగిలిపోయిన చోట్ల నిర్మాణం చేస్తే హైదరాబాద్‌లో ఎక్కడా కాలనీలు మునగకుండా , వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఆస్కారం ఉందన్నారు. స్టాటిజికల్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద నిధులు ఇవ్వాలని కోరామన్నారు. స్వచ్ఛభారత్ కింద నిధులు ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశామన్నారు.