మా తండా.. మా రాజ్యం.. కేసీఆర్ వల్లే సాకారం
గిరిజనులకు న్యాయం జరిగింది, వారి భవిష్యత్తుకి భరోసా లభించింది ఒక్క కేసీఆర్ పాలనలోనేనంటున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు.
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. భారత్ కి సంబంధించి గిరిజనులు అత్యంత సంతోషంగా ఉన్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని అంటున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గిరిపుత్రుల సమస్యలు పరిష్కరించి వారి అభివృద్ధికి కృషిచేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరిపుత్రులను కేసీఆర్ ఆ భూములకు యజమానులని చేశారని, 4.06 లక్షల ఎకరాలకుగాను 1.51 లక్షల పోడు రైతులకు పట్టాలను అందజేశామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
గిరిజనులకు కేసీఆర్ ఏమేం చేశారంటే..?
గిరిజనులకు న్యాయం జరిగింది, వారి భవిష్యత్తుకి భరోసా లభించింది ఒక్క కేసీఆర్ పాలనలోనేనంటున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తోందని వివరించారు.
గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆదివాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయిస్తోందని వెల్లడించారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజనుల కలను సాకారం చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.