మహిళా రిజర్వేషన్ బిల్లు: ఈ నెల 10న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చిన కల్వకుంట్ల కవిత
కవిత మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పై మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో.... తర్వాత అరెస్ట్ కవితదే అని తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై కవిత తీవ్రంగా స్పంధించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి సంస్థ అధ్వర్యంలో ఢిల్లీలో ఒక రోజు ధర్నా జరగనుంది. ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని భారత జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
కవిత మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పై మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో.... తర్వాత అరెస్ట్ కవితదే అని తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై కవిత తీవ్రంగా స్పంధించారు.
''బీజేపీ నాయకులు ఆదేశాలమేరకు సీబీఐ తనను అరెస్టు చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం కాదు. అరెస్ట్ గురించి సీబీఐ చెప్పాలి తప్ప బీజేపీ నేతలు కాదు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని బీజేపీ నేతలు మర్చిపోతున్నారు.'' అని కవిత ధ్వజమెత్తారు.