మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్ మంజూరు
మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్ మంజూరు

పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పీ రేవతి, న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వీ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతి సోమ, శుక్రవారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు రేవతి, తన్వి యాదవ్లకు బెయిల్ మంజూరు చేసింది.
వారిపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. కోర్టు ఆర్డర్ కాపీలు అందిన వెంటనే.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. రేవంత్ సర్కార్ నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్ చేయడమే పెద్ద నేరమైంది. ప్రజా సమస్యలను తమ చానల్ ద్వారా ప్రసారం చేయడమే కాంగ్రెస్ సర్కారుకు కంటగింపుగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అంటూ మహిళా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే