సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. వీడియో
గజ్వేల్, ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జేబీఎస్ నుంచి దుబ్బాకకు బయల్దేరింది. అప్పటికే బస్సు జనంతో నిండిపోయింది. బస్సు తొగుట మండలంలోని వెంకట్రావు పేటకు చేరుకుంది.
తెలంగాణ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. సీట్ల కోసం తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొందరు మహిళలు ఫైటింగులకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కానీ, ఇక్కడ సీటుకోసం ఏకంగా చెప్పులతోనే పొట్టుపొట్టు కొట్టుకున్నారు ఇద్దరు మహిళలు.
మ్యాటర్‌లోకి వెళ్తే.. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జేబీఎస్ నుంచి దుబ్బాకకు బయల్దేరింది. అప్పటికే బస్సు జనంతో నిండిపోయింది. బస్సు తొగుట మండలంలోని వెంకట్రావు పేటకు చేరుకుంది. కొందరు బస్సు దిగారు, ఇంకొందరు ఎక్కారు. ఇదే టైమ్‌లో సీటు నాదంటే నాదంటూ ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. మాటామాటా పెరిగింది. చెప్పులు తీసుకుని ఒకర్నొకరు పొట్టుపొట్టు కొట్టుకున్నారు.
ఆర్టీసీ బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2024
సిద్దిపేట - సికింద్రాబాద్ నుంచి దుబ్బాకకి బస్సు వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్న మహిళలు. pic.twitter.com/70XJ6FpMVd
ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మగాళ్లకు సీట్లు కూడా దొరకడం లేదు. ఇంకొన్ని చోట్ల కండక్టర్లపై దాడులు జరిగిన ఘటనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సీటు కోసం ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం మంచిదే అయినా బస్సుల సంఖ్యను పెంచకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.