Telugu Global
Telangana

మహిళలకు సేఫ్ ప్లేస్ హైదరాబాద్ -కేటీఆర్

మహిళలను ప్రోత్సహించేందుకే వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు కేటీఆర్. దీంతో చాలామంది చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్‌ ల కోసం వి-హబ్‌ ఏర్పాటు చేశామన్నారు.

మహిళలకు సేఫ్ ప్లేస్ హైదరాబాద్ -కేటీఆర్
X

హైదరాబాద్‌ ను మహిళలు సురక్షిత నగరంగా భావిస్తున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. తమ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌ తెలంగాణలో భాగంగా ఉమెన్‌ ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు మహిళలు హాజరయ్యారు, మంత్రి కేటీఆర్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు 4 ఇండస్ట్రియల్ పార్క్ లు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు కేటీఆర్.

ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు మంత్రి కేటీఆర్‌. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి కుటుంబాల్లో మహిళలది ప్రధాన పాత్ర అని, ఉమ్మడి కుటుంబంలోనే తన చిన్నతనం గడిచిందని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో ఎంతోమంది స్ట్రాంగ్‌ ఉమెన్‌ లీడర్లను చూశానని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ నుంచి ఎంతోమంది మహిళలు క్రీడల్లో రాణిస్తున్నారని, తెలంగాణకు మంచి పేరు తెచ్చారని అన్నారు.

మహిళలను ప్రోత్సహించేందుకే వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు కేటీఆర్. దీంతో చాలామంది చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్‌ ల కోసం వి-హబ్‌ ఏర్పాటు చేశామన్నారు. మేనిఫెస్టోలో లేకపోయినా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిందని, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. ప్రతి చిన్నారిపై రూ.10 వేలకుపైగా ఖర్చు చేస్తున్నామని వివరించారు మంత్రి కేటీఆర్.

First Published:  19 Nov 2023 12:46 PM IST
Next Story