Telugu Global
National

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25 నుండి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 21 తేదీ వరకు కొనసాగనున్నాయి.

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
X

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 21 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలలో ఎన్డీయో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. జమిలీ ఎన్నికలకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ సవరణలకు లోక్ సభలోని 543 స్థానాల్లో కనీసం 67% మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి.

అటు రాజ్యసభలో 245 సీట్లలో 67% ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియాగానే ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై లోక్ సభ, రాజ్య సభ సభ్యులు చర్చించనున్నారు. అలాగే పలు బిల్లులను ప్రవేశం పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైవుతుంది.

First Published:  2 Nov 2024 11:17 AM GMT
Next Story