Telugu Global
Telangana

ఆ మూడు రోజులు తెలంగాణలో వైన్ షాప్స్ బంద్

తెలంగాణ 7 ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఆ మూడు రోజులు తెలంగాణలో వైన్ షాప్స్ బంద్
X

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 7 ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయ‌నున్న‌ట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4 గంట‌ల నుంచి 27 సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వైన్ షాపులు మూసి ఉండ‌నున్నాయి. మ‌ద్యం దుకాణాల‌తో పాటు క‌ల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి.వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ ఉపాధ్యాయ స్థానానికి, మెద‌క్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – క‌రీంన‌గ‌ర్ ఉపాధ్యాయ స్థానానికి 27న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

మెద‌క్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి కూడా అదే రోజు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో మ‌ద్యం దుకాణాలను మూసివేయ‌నున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు. వైన్ షాప్స్‌తో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

First Published:  24 Feb 2025 3:03 PM IST
Next Story