నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆయనేనా..!
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలో దించాలని ప్లాన్ చేస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులెవరనేదానిపై ఆసక్తి నెలకొంది. గతంలో ఎంపీలుగా చేసిన రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి ఇప్పడు ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నారు. దీంతో వారు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన స్థానాలతో పాటు మిగతా స్థానాల్లోనూ కొత్త అభ్యర్థులను నిలబెట్టాల్సిన పరిస్థితి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలో దించాలని ప్లాన్ చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన నాగర్ కర్నూల్ స్థానం ఎంపీ అభ్యర్థి ఫైనల్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం AICC కార్యదర్శిగా సంపత్ కుమార్‌ను నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అంటూ సంపత్ కుమార్ సైతం ఇటీవల కామెంట్స్ చేశారు.
సంపత్ కుమార్‌ను నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో భాగంగానే ఇన్నాళ్లూ ఆ స్థానాన్ని ఆశిస్తూ వచ్చిన పార్టీ సీనియర్ నేత మల్లు రవికి కేబినెట్ హోదాతో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా పదవి కట్టబెట్టారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. మల్లు రవి ఢిల్లీ వెళ్లడంతో సంపత్ కుమార్‌కు లైన్ క్లియర్ అయినట్లేనని చెప్తున్నాయి.