Telugu Global
Telangana

పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా..కొంచెం టైం పడుతుంది : సీఎం రేవంత్

‘‘ఉద్యోగాల కోసమే భద్రాది కొత్త గూడెం జిల్లా పాల్వంచలో మొదట తెలంగాణ ఉద్యమం మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా..కొంచెం టైం పడుతుంది : సీఎం రేవంత్
X

ప్రత్యేక తెలంగాణ కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తొలిసారి లేఖ ఇచ్చింది చిన్నారెడ్డేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో లేదని అప్పట్లో ప్రచారం చేశారని, కానీ కొత్త గూడెం నుంచే ప్రారంభమైందని సీఎం తెలిపారు. తమకు ఉద్యోగాలనే నినాదంతోనే ఉద్యమం మొదలైందన్నారు. సంవత్సరం క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఓట్లు వేస్తేనే తమకు పదవులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ప్రజల అభిమానంతోనే తాను ముఖ్యమంత్రిని అయ్యాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మార్పు కావాలని, కాంగ్రెస్ రావాలనే నినాదంతో ఎన్నికలకు వెళ్లామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చామని తెలిపారు. ప్రజల త్యాగాలు, ఆకాంక్షలు తనకు తెలసని, అందుకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నానని రేవంత్ చెప్పారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఇవ్వొచ్చు కదా..? అని ప్రశ్నించారు.

కులగణనలో హరీశ్ రావు, కేటీఆర్ ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. కొండరెడ్డిపల్లి అనే గ్రామీం నుంచి వచ్చిన నేను మీ అభిమానంతో సీఎం అయ్యానని తెలిపారు. ఉద్యోగాలు, ప్రాంత అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. పెద్దపల్లికి SRSP నుంచి నీళ్లు రాకపోతే పోరాడిన వాళ్లను జైలులో వేశారు కేసీఆర్. ప్రాజెక్టుల గురించి కేసీఆర్ మాట్లాడారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకుంటామన్నారు. గ్రూప్‌-4, సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైనవారికి అపాయింట్మెంట్ ఆర్డర్‌లను సీఎం అందజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను, సీఎం కప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సభలో పాల్గొన్నారు.

First Published:  4 Dec 2024 8:14 PM IST
Next Story