ఈ నెల 15 తర్వాతే హాజరవుతా... ఈడీకి కవిత లేఖ
ఈ నెల 15 తర్వాత హాజరయ్యేందుకు అనుమతించాలని కవిత ఈడీకి రాసిన లేఖలో కోరారు. 10వ తేదీన ఢిల్లీలో జరిగే ధర్నాకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఈ పరిస్థితుల్లో 9వ తేదీన హాజరుకాలేనని ఆమె అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 9వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఈడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఈ నెల 10 న ఢిల్లీలో ధర్నా ఉన్నందున 9వ తేదీన తాను హాజరుకాలేనని తెలిపిన కవిత ఈ మేరకు ఈడీ అధికారులకు లేఖ రాశారు.
ఈ నెల 15 తర్వాత హాజరయ్యేందుకు అనుమతించాలని కవిత ఈడీకి రాసిన లేఖలో కోరారు. 10వ తేదీన ఢిల్లీలో జరిగే ధర్నాకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఈ పరిస్థితుల్లో 9వ తేదీన హాజరుకాలేనని ఆమె అన్నారు.
కాగా 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష చేయనున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్న ఈ దీక్షకు సంఘీభావంగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ సహా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. అనేక రాష్ట్రాల నుంచిమహిళా సంఘాల కార్యకర్తలు, హక్కుల కార్యకర్తలు పాల్గొననున్నారు.