అసహజ శృంగారం కోరుకుంటున్న ఆ ఐఏఎస్ అధికారి
సందీప్ కుమార్‌ది బీహార్. 2014లో తెలంగాణ కేడర్‌కు ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2021లో ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు.
తెలంగాణ కేడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝూపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు కోర్టు ఆదేశించింది. సందీప్ కుమార్‌పై ఆయన భార్యే ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసమే కాకుండా, తనను శారీరకంగా హింసిస్తున్నారని, అసహజ శృంగారానికి ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
తన సొంత రాష్ట్రంలోని కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదంటూ ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు సందీప్‌కుమార్ ఝూపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.
సందీప్ కుమార్‌ది బీహార్. 2014లో తెలంగాణ కేడర్‌కు ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2021లో ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్టు ఆమె చెబుతున్నారు.
అయినా సరే మరింత బంగారం, అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు ఇష్టం లేకపోయినా అసహజ శృంగారం కోసం బలవంతం చేస్తున్నారని వివరించారు. సందీప్ కుమార్ ఝూ ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.