మహారాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్ కు అఖండ స్వాగతం ఎందుకు పలుకుతున్నారు ?
అధికార పార్టీల పట్ల ప్రజలు విముఖత చూపుతుండటంతో నేతలు నేడు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేసే తెలంగాణ మిషన్ భగీరథ పథకాన్ని తమ దగ్గర కూడా అమలు చేయాలని మహిళలు తమ శాసనసభ్యులపై ఒత్తిడి పెంచుతున్నారు.
భారత రాష్ట్ర సమితి ఏర్పడి మహారాష్ట్రలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఆ రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటివరకు అక్కడ బీఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొన్న సభలన్నీ విజయవంతం అయ్యాయి. ఒక కొత్త పార్టీకి మహారాష్ర ప్రజలు రెడ్ కార్పెట్ పరచడానికి కారణమేంటి ?
గత 17 ఏళ్లుగా తమను పాలించిన రాజకీయ పార్టీలు తమ అభివృద్ది కోసం కించిత్ కూడా చేసిందేమీ లేదని మహారాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.
వేగంగా పట్టణీకరణ జరిగినప్పటికీ, సమాజ అవసరాలు పరిష్కరించబడలేదు. యువకులు, రైతులు ప్రభుత్వాల పనితీరుతో పూర్తిగా నిరాశ చెందారు. వారు ప్రస్తుతం మార్పును స్వాగతిస్తున్నారు.
అధికార పార్టీల పట్ల ప్రజలు విముఖత చూపుతుండటంతో నేతలు నేడు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేసే తెలంగాణ మిషన్ భగీరథ పథకాన్ని తమ దగ్గర కూడా అమలు చేయాలని మహిళలు తమ శాసనసభ్యులపై ఒత్తిడి పెంచుతున్నారు. మహారాష్ట్రలో చాలా మంది నేటికీ తాగునీటి కోసం చాలా దూరం నడిచి వెళ్లి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తోంది.
మౌలిక సదుపాయాలకు తోడ్పడే భారీ ప్రాజెక్టులు తెలంగాణలో రికార్డు సమయంలో పూర్తయ్యాయి. కానీ మహా రాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లాలోని అనేక గ్రామాలు, పట్టణాలకు తాగునీటి సరఫరా కోసం జయక్‌వాడి ప్రాజెక్ట్‌లో భాగంగా గోదావరి నుండి నీటిని తోడేందుకు 100 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి 15 సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని, ఇది ఇప్పటికీ అసంపూర్తిగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు.
మహారాష్ట్రలో అనేక నదులపై 1,800 ఆనకట్టలు ఉన్నాయి. గోదావరి, కృష్ణా, నర్మద, తపతి సహా ప్రధాన నదులు రాష్ట్రం అంతటా ప్రవహిస్తున్నాయి. కానీ నీటిపారుదల పెద్ద వైఫల్య కథ అని, ముంబై దేశానికి వ్యాపార రాజధానిగా ఆవిర్భవించినప్పటికీ, రాజకీయ నాయకత్వ వైఫల్యం కారణంగా నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మిగిలిపోయిందని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ ప్రకాశరావు అన్నారు. అందుకే మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్ తమను సమస్యలనుండి గట్టెక్కిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. అందుకే మహారాష్ట్ర ప్రజలు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నారని ఆయన తెలిపారు.