Telugu Global
Telangana

అసలు తెలంగాణాలో టీడీపీ, జనసేన ఎందుకున్నట్లు ?

గడచిన మూడున్నరేళ్ళలో తెలంగాణా జరిగిన ఒక్క ఉపఎన్నికలో కూడా రెండుపార్టీలు పోటీచేయలేదు. పోనీ స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీచేశారా అంటే అదీలేదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే తెలంగాణా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారా అంటే ఎక్కడా కనబడరు.

అసలు తెలంగాణాలో టీడీపీ, జనసేన ఎందుకున్నట్లు ?
X

గడచిన మూడున్నరేళ్ళలో తెలంగాణా జరిగిన ఒక్క ఉపఎన్నికలో కూడా రెండుపార్టీలు పోటీచేయలేదు. పోనీ స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీచేశారా అంటే అదీలేదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే తెలంగాణా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారా అంటే ఎక్కడా కనబడరు. అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్షాల్లోని కాంగ్రెస్, బీజేపీ గురించి ఒక్కమాట కూడా మాట్లాడరు. టీఆర్ఎస్, బీజేపీల ప్రస్తావన తేవాలన్నా, ఆరోపణలు చేయాలన్నా వణికిపోతుంటారు.

ఇలాంటి పరిస్ధితుల్లో వీళ్ళిద్దరు అసలు తెలంగాణా రాజకీయాల్లో ఎందుకున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండరు అలాగని పూర్తిగా వదిలేయరు. ఏదో ఉన్నామంటే ఉన్నామనిపించుకుంటున్నారంతే. లెటర్ హెడ్ల రాజకీయాలు ఎంతకాలం చేస్తారో అర్ధంకావటంలేదు. ఈ పాటికే ఇదంతా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ గురించే అని అర్ధమైపోయుంటుంది.

హైదరాబాద్ లో కూర్చుని కేసీయార్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి వీళ్ళకి నోరు లేవటంలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపైన ఆరోపణలు, విమర్శలతోనే కాలం నెట్టుకొచ్చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణాలో క్రియాశీలకంగా ఉండాలని నేతలు ఎంత చెబుతున్నా ఇద్దరు పట్టించుకోవటంలేదు. మళ్ళీ రెగ్యులర్ గా నేతలతో సమీక్షలు మాత్రం జరుపుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగినా టీడీపీ, జనసేన జాడే కనబడలేదు. తాజాగా మునుగోడు ఉపఎన్నికనే తీసుకుందాం. ఇక్కడ పోటీచేయాల్సిందే అని జనసేన నేతలు పదే పదే చెప్పినా పవన్ ఇష్టపడలేదు. ఉపఎన్నికలో పోటీచేయటానికి పార్టీ సిద్దంగా లేదనే పిచ్చి ప్రకటన చేసి తప్పుకున్నారు.

ఇక టీడీపీ విషయం చూస్తే నేతలతో మూడుసార్లు సమీక్షలు జరిపారు. మూడుసార్లు మునుగోడులో పోటీచేయాల్సిందే అని నేతలంతా గట్టిగా చెప్పారు. రెండోసారి సమావేశంలో జక్కలి ఐలయ్యయాదవ్ నామినేషన్ వేయటానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇంతలో ఏమైందో ఏమో మూడోసారి సమీక్షలో పోటీవద్దని నిర్ణయించారు. రెండుపార్టీల్లోని నేతలేమో పోటీచేయాలని, అధినేతలేమో దూరంగా ఉండాలని నిర్ణయించటం భలే విచిత్రంగా ఉంది. ఇంతోటిదానికి తెలంగాణాలో ఈ పార్టీలు ఎందుకున్నట్లో అర్ధం కావటంలేదు.

First Published:  14 Oct 2022 12:01 PM IST
Next Story