రాజస్థాన్‌కు అమృత్ భారత్ రైలు..స్టార్ట్ ఎప్పుడంటే..?
రాజస్థాన్‌లో తొలి అమృత్ భారత్ రైలును ఎన్డీయే సర్కార్ ప్రారంభించబోతున్నది. అజ్మీర్ నుంచి జైపూర్ మీదుగా రాంచీకి నడవనున్నది.
రాజస్థాన్‌లో తొలి అమృత్ భారత్ రైలును ఎన్డీయే సర్కార్ ప్రారంభించబోతున్నది. అజ్మీర్ నుంచి జైపూర్ మీదుగా రాంచీకి నడవనున్నది. సమాచారం మేరకు ఈ అమృత్ ఇండియన్ రైల్వేస్ ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వందే భారత్ తర్వాత రైల్వేశాఖ అమృత్ భారత్‌ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తొలి దశలో 26 రూట్లలో అమృత్ భారత్ రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించినట్లుగా రైల్వే బోర్డు అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు ప్రారంభంలో న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వేస్టేషన్ నుంచి దర్భంగా జంక్షన్ వరకు దేశంలోనే తొలి అమృత్ భారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత పలు మార్గాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రకటించిన అమృత్ భారత్ రైలు రాజస్థాన్ కు మొదటిది.రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి రాంచీ మార్గంలో నడిచే ఈ రైలులో కనీసం 18 నుంచి గరిష్ఠంగా 22 కోచ్‌లు ఉండే అవకాశం ఉన్నది. అన్ని కోచ్‌లు నాన్ ఏసీ స్లీపర్, జనరల్ కేటగిరీ చెందినవి. రైలు గరిష్ఠ వేగం గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్తుంది.
రైలు కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, టాక్-బ్యాక్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. ప్రయాణికులు ఏదైనా ఇబ్బందికర పరిస్థితిలో లోకోపైలెట్, రైలు మేనేజర్‌ను సంప్రదించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, ప్రతి కోచ్‌లో వాక్యూమ్ బయో టాయిలెట్లు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. ఇక రైల్వేశాఖ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కోచ్‌లలో అధునాతన, అత్యాధునిక సాంకేతిక హంగులు అద్దింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. రైలు గరిష్ఠ వేగం గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్నది. రైళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే అమృత్ భారత్ రైలులో ప్రయాణికులతో అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. రైలు కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, టాక్-బ్యాక్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. దాంతో ప్రయాణికులు ఏదైనా ఇబ్బందికర పరిస్థితిలో లోకోపైలెట్, రైలు మేనేజర్‌ను సంప్రదించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, ప్రతి కోచ్‌లో వాక్యూమ్ బయో టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు రైల్వేశాఖ కల్పించింది.