Telugu Global
Telangana

మెట్రో విస్తరణకు పైసా తేలేదు.. బీజేపీ ఎంపీలతో ఉపయోగం ఏంటి..?

తెలంగాణ నుంచి గెలిచిన 8మంది బీజేపీ ఎంపీలతో రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగం లేదని అన్నారు కేటీఆర్.

మెట్రో విస్తరణకు పైసా తేలేదు.. బీజేపీ ఎంపీలతో ఉపయోగం ఏంటి..?
X

కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టినా 2024 ఎన్నికలు బీజేపీకి పెద్ద షాకిచ్చాయనే చెప్పాలి. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చాయి. అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయినా ఆ ఎంపీలతో రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదని తేల్చి చెప్పారు.

మెట్రోకి మొండిచేయి..

హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర బడ్జెట్ లో ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు కేటీఆర్. గతంలో కేంద్రానికి పలుమార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలున్నా కూడా ఇలాంటి పరిస్థితి రావడం దారుణం అని అన్నారు కేటీఆర్.


వీటి సంగతేంటి..?

పోనీ మెట్రో నిర్మాణాలకు కేంద్రం నిధులివ్వదు అనుకోడానికి లేదు. గత పదేళ్లలో దేశంలో 20 మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సమకూర్చిందని గుర్తు చేశారు కేటీఆర్.

- ఉత్తర ప్రదేశ్ (4 ప్రాజెక్టులు) - రూ. 5,134.99 కోట్లు

- మహారాష్ట్ర (3 ప్రాజెక్టులు) - రూ. 4,109 కోట్లు

- గుజరాత్ (3 ప్రాజెక్టులు) - రూ. 3,777.85 కోట్లు

- ఢిల్లీ (2 ప్రాజెక్టులు) - రూ. 3,520.52 కోట్లు

- కర్నాటక- రూ. 1880.14 కోట్లు

- మధ్యప్రదేశ్ (2 ప్రాజెక్టులు) - రూ. 1,638.02 కోట్లు

- బీహార్ - రూ. 1,400.75 కోట్లు

- తమిళనాడు - రూ. 713 కోట్లు

- కేరళ (2 ప్రాజెక్టులు) - రూ. 146.74 కోట్లు

- రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ (ఢిల్లీ-ఘజియాబాద్) - రూ. 1,106.65 కోట్లు

ఇలా 20 ప్రాజెక్ట్ లకు కేంద్రం నిధులు సమకూర్చిందని, తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించిందని విమర్శించారు. తెలంగాణ నుంచి గెలిచిన 8మంది బీజేపీ ఎంపీలు సొంత రాష్ట్రానికి ఏం తెచ్చారని నిలదీశారు. ఇది అన్యాయం అని మండిపడ్డారు కేటీఆర్.

First Published:  27 July 2024 8:40 AM IST
Next Story