Telugu Global
Telangana

పండుగ పూట ఆర్టీసీ చార్జీల బాదుడేంది?

ప్రజాపాలన అంటే ఇదేనా.. సీఎం రేవంత్‌ పై మండిపడ్డ మాజీ మంత్రి హరీశ్‌ రావు

పండుగ పూట ఆర్టీసీ చార్జీల బాదుడేంది?
X

బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులపై ఆర్టీసీ బస్సు చార్జీల బాదుడేంటి అని సీఎం రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌ కు తిరిగి వచ్చే ప్రయాణికులను పెంచిన చార్జీలను ముక్కుపిండి వసూలు చేయడం దుర్మార్గమన్నారు. జేబీఎస్‌ నుంచి సిద్దిపేటకు రూ.140ల టికెట్‌ తో ప్రయాణించిన వ్యక్తి తిరిగి హైదరాబాద్‌ వచ్చేందుకు రూ.200 పెట్టి టికెట్‌ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. హన్మకొండ నుంచి హైదరాబాద్‌ కు సూపర్‌ లగ్జరీ బస్సు టికెట్‌ సాధారణ రోజుల్లో రూ.300 ఉంటే.. పండుగ పూట ప్రభుత్వం రూ.420 చార్జీ వసూలు చేస్తుందని తెలిపారు. మిగతా అన్ని రూట్లలోనూ చార్జీల ధరలు భారీగా పెంచేసి పండుగ పూట ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల సంఖ్య పెంచకుండా టికెట్‌ చార్జీలు పెంచి ప్రజలకు పండుగ సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన అని ముఖ్యమంత్రిని నిలదీశారు.

First Published:  14 Oct 2024 12:51 PM IST
Next Story