Telugu Global
Telangana

ఆడ, మగ చూడకుండా బట్టలూడదీసి కొడతా అనడం దేనికి సంకేతం : సత్యవతి

మహిళా జర్నలిస్టులను బట్టలు ఊడదీసి కొడతా అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అతి జుగుప్సాకరంగా మాట్లాడాడని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ఆడ, మగ చూడకుండా బట్టలూడదీసి కొడతా అనడం దేనికి సంకేతం : సత్యవతి
X

అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి తమను మోసం చేశాడు అనే ఆగ్రహంతో రైతులు మాట్లాడిన మాటలు చూపెట్టినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను బట్టలు ఊడదీసి కొడతా అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అతి జుగుప్సాకరంగా మాట్లాడాడని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. భారతదేశంలో మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము రేవంత్ రెడ్డి గత 5 ఏండ్లుగా మా కుటుంబంలో చిన్న పిల్లలను కూడా వదలకుండా విషప్రచారాలు చేపించాడు, ఇప్పుడు కర్మ రూపంలో ఆయనకు అవ్వన్నీ ప్రజల నుండి తిరిగి వస్తున్నాయి కవిత పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పట్ల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఒకప్పుడు ఇదే యూట్యూబ్ మీడియాను నమ్మి తప్పుడు మాటలు, తప్పుడు హామీలను చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రజల గురించి, సమాజంలో ఉండే వ్యక్తుల గురించి మాట్లాడితే తప్పు పడతారు కానీ తనను, తన కుటుంబాన్ని ఏమన్నా అంటే ఆడ, మగా చూడకుండా బట్టలూడదీసి కొడతా అని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు దేనికి సంకేతమని మాజీ మంత్రి ప్రశ్నించారు. రెండు గౌరవ సభల నుండి రేవంత్ రెడ్డి బుద్ధి, సంస్కారం ఇదని ప్రజలకు చెప్పదలుచుకున్నాడాని ఆమె అన్నారు.

First Published:  15 March 2025 8:16 PM IST
Next Story