Telugu Global
Telangana

నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున ఏం చెప్పారంటే?

టాలీవుడ్ హీరో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు నేడు రికార్డ్ చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల తమ ఫ్యామిలీ పరువు, మర్యాదలకు తీవ్ర భంగం కలిందని నాగ్ కోర్టులో పేర్కొన్నారు.

నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున ఏం చెప్పారంటే?
X

మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టాలీవుడ్ హీరో నాగార్జున ఇవాళ నాంపల్లి కోర్టుకు తెలిపారు. ఆమె కామెంట్స్ వల్ల తమ ఫ్యామిలీ పరువు, మర్యాదలకు తీవ్ర భంగం కలిందని ఆయన తెలిపారు. రాజకీయ విమర్శలు భాగంగా తనతోపాటు చైతూ, సమంత పేర్లు ప్రస్తావించారని నాగ్ పేర్కొన్నారు. అన్ని టీవీ ఛానళ్లలోనూ ఇది ప్రసారమైందని వెల్లడించారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాంగ్మూలం సందర్భంగా కోరారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు. తాజాగా.. కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో.. ‘మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు నాగార్జున మంగళవారం హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు.

నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు సైతం కోర్టుకు హాజరయ్యారు. అంతకుముందు, మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. నాగార్జున రాక నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్’తో ముడిపెడుతూ సురేఖ చేసిన కామెంట్స్‌పై తెలుగు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాని తదితరులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మలాన్ని నమోదు చేసిన నాంపల్లి కోర్టు తుదుపరి విచారణను ఈ నెల 10న వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

First Published:  8 Oct 2024 11:07 AM GMT
Next Story