Telugu Global
Telangana

సంక్షోభ హాస్టళ్లుగా సంక్షేమ హాస్టళ్లు

ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనతో శైలజ అనే విద్యార్థిని చనిపోతే మంత్రి పొన్నం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని కాసం ఆగ్రహం

సంక్షోభ హాస్టళ్లుగా సంక్షేమ హాస్టళ్లు
X

నారాయణపేట జిల్లా డీఈవో బదిలీ వెనుక మర్మం ఏమిటి? అవినీతి అధికారులకు ప్రభుత్వం ఎందుకు వత్తాసు పలుకుతున్నదని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యాయలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టళ్లుగా మారాయన్నారు. సంక్షేమ హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు ఉంటే మానవ హక్కులు, బాలల హక్కుల అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన స్వయం ప్రకటిత విద్యావేత్తలు ఆకునూరి మురళి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విశ్వేశ్వర్‌రావులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గురుకులాల్లో పరిస్థితులపై మంత్రులు పొన్నం, సీతక్క తలో విధంగా మాట్లాడుతున్నారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనతో శైలజ అనే విద్యార్థిని చనిపోతే మంత్రి పొన్నం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని, పదేళ్ల తర్వాత అధికారం వస్తే విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సింది పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గురుకుల పాఠశాలల్లో వరుసుగా జరుగుతున్న ఘటనలపై సీఎం ఉడేలు దెబ్బలు కొట్టినట్లు ప్రకటనలు చేస్తున్నారు గాని చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆయన జిల్లాలోనే ఇప్పటికి మూడు ఘటనలు జరిగాయి. వరుసగా ఘటనలు జరుగుతుంటే సీఎం రేవంత్‌ స్పందించడం లేదన్నారు. అలాగే కేటీఆర్‌ కూడా ప్రధానిపై అవగాహన రాహిత్యం పోస్టు పెట్టడాన్ని తప్పుపట్టారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని మాట్లాడితే తప్పేమున్నదని, కలిసి పనిచేయాలని సూచిస్తే దానిపై పోస్టులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌-బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్‌ ఆరోపించడాన్ని కాసం ఖండించారు. ఈ రెండు పార్టీలు ఉత్తర, దక్షిణ ధృవాలని కలిసి పనిచేసే అవకాశం లేదన్నారు. ఏ పార్టీ ఎవరితో కలిసి పనిచేస్తున్నదో ప్రజలకు తెలుసన్నారు.

First Published:  28 Nov 2024 3:34 PM IST
Next Story