మూసీ బాధితులకు అండగా ఉంటాం : కేటీఆర్
మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో మూసీ నిర్వహితులతో మాజీ మంత్రి సమావేశమయ్యారు.
మూసీ ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా కల్పించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చి కరెంట్ బిల్లులు, హౌస్ టాక్స్ కట్టించుకున్న కాంగ్రెస్ వాళ్లే పేదలను కబ్జాదారులనటం దారుణమని మాజీ మంత్రి మండిపడ్డారు. తమకు అండగా ఉండాలంటూ తెలంగాణ భవన్‌కు వచ్చిన బాధితులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా బాధితులందరికీ న్యాయ సాయం బీఆర్ఎస్ పార్టీయే చేస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పేద ప్రజల ఇళ్లను లాక్కుంటుంది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
ఎవ్వరూ ఆధైర్య పడవద్దని బీఆర్‌ఎస్ ఎప్పుడు మీకోసం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ తమ ఇళ్లను కూలగొడతామంటూ ఇబ్బంది పెడుతోందంటూ బాధితులు కేటీఆర్‌కు తమ ఆవేదన చెప్పుకున్నారు. 50 ఏళ్లుగా మూసీ పరివాహాక ప్రాంతంలో ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేస్తామంటే ఎక్కడికి వెళ్లేదంటూ వాపోయారు. పేద ప్రజల ఇళ్లను ఇష్టానుసారంగా కూల్చేస్తామంటే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు ఏ సమస్య వచ్చినా సరే బీఆర్ఎస్ స్థానిక నాయకులను సంప్రదించాలన్నారు. అదే విధంగా మీరు గెలిపించిన ప్రజాప్రతినిధులను కూడా నిలదీయాలని వారికి సూచించారు. ఈ సందర్బంగా తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్ కు మూసీ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.