Telugu Global
Telangana

రేవంత్‌ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం

రేవంత్‌ కంటే చంద్రబాబు చాలా నయమన్న మందకృష్ణ

రేవంత్‌ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం
X

చేయూత పింఛన్‌ దారులందరినీ వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) ఏకీకృతం చేయడానికి యత్నిస్తుందని ఆ సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. చేయూత పింఛన్‌ తీసుకునే వారిని రేవంత్‌ ప్రభుత్వం నట్టేట ముంచిందని మండిపడ్డారు. వారితో కలిసి బలమైన ఉద్యమం చేపడుతామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నమ్మిన పింఛన్‌దారులు కాంగ్రెస్‌ను గెలిపించారని గుర్తుచేశారు. 10 నెలలు అయినా.. ఎందుకు పెంచి ఇవ్వడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు.

ఏపీలో ఏప్రిల్‌ నెలలో మేం చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చాం. దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్‌ ఇవ్వాలని కోరాం. ఆయన జూన్‌లో అధికారంలోకి రాగానే ఏప్రిల్‌, మే, జూన్‌ మూడు నెలలవి ఇచ్చారు. ఏపీలో కండరాల క్షీణత ఉన్న వాళ్లకు రూ. 15 వేల పింఛన్లు ఇస్తున్నారు. రేవంత్‌ కంటే చంద్రబాబు చాలా నయమని మందకృష్ణ చెప్పారు. నవంబర్‌ 1 నుంచి 16 వరకు ప్రతి రోజు రెండు జిల్లాల్లో చేయూత పింఛన్‌ లబ్ధిదారులకు చైతన్య సభలు నిర్వహిస్తాం. అప్పటికీ ఇవ్వకుంటే నవంబర్‌ 26న చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తాం. 26న వికలాంగుల మహాగర్జన పేరుతో వేలాదిమందితో ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేపడుతాం. కాంగ్రేసేతర అన్ని రాజకీయపార్టీలను ఆహ్వాస్తామన్నారు. రేవంత్‌ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని మందకృష్ణ అన్నారు.

First Published:  26 Oct 2024 2:25 PM IST
Next Story