Telugu Global
Telangana

అధికారులకు కేటీఆర్ వార్నింగ్..మిత్తితో సహా చెల్లిస్తాం

రైతుల కోసం ఒక‌ట్రెండు ఏండ్లు జైల్లో ఉండేందుకు సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

అధికారులకు కేటీఆర్ వార్నింగ్..మిత్తితో సహా చెల్లిస్తాం
X

కాంగ్రెస్ పార్టీ నేతలను ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైత‌న్న‌ల ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రైతుల కోసం ఒక‌ట్రెండు ఏండ్లు జైల్లో ఉండేందుకు సిద్ధమని కేటీఆర్ అన్నారు. ఎవ‌నీ అయ్య‌కు భ‌య‌ప‌డేది లేదన్నారు. ఆడ బిడ్డాలకి తులం బంగారం ఇస్తామ‌ని చెప్పి మోసం చేసిన ఈ చార్ సౌ బీస్‌గాని మీద కేసులు పెట్టాలి. రైతుబంధు ఎగ్గొట్టి, రుణ‌మాఫీ చేయ‌నందుకు రైతులు కేసులు పెట్టాలి. 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ని చెప్పి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌నందుకు యువ‌త కేసులు పెట్టాలి. ఇలా అన్ని వ‌ర్గాలు పోలీసు స్టేష‌న్ల ముందు లైన్లు క‌ట్టి చీటింగ్ కేసు పెడితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయ‌కుడు కూడా ఈ రాష్ట్రంలో మిగల‌డు అని కేటీఆర్ తెలిపారు. పోలీసులకు కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు.

ఇలాంటి కిరాత‌క ప‌నులు గత బీఆర్ఎస్ పాల‌న‌లో చేయ‌లేదు. మంత్రినో, కంత్రినో ఫోన్ చేస్తే ఆగం కాకండి.. న్యాయం, ధ‌ర్మం ప్ర‌కారం న‌డుచుకోండి. పోలీసులైనా, అధికారులైనా ఎక్స్‌ట్రాలు చేస్తే పేర్లు రాసిపెట్టి మిత్తితో స‌హా ఇస్తాం. రేవంత్ రెడ్డి రాజు, చ‌క్ర‌వ‌ర్తి కాదు. చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి నాయ‌కుల‌తోనే కొట్లాడినం.. వీడెంత చిట్టినాయుడు.. గింతంత మ‌నిషి.. వాని చూసి ఆగం కావొద్దు. ఉద్యోగులు ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఉద్యోగం చేయండి. అతికి పోతే మా టైమ్ వ‌చ్చాక మిత్తితో స‌హా ఇస్తామ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఏడున్నరకు బయలుదేరమని వస్తున్నప్పుడు చూస్తున్న రేవంత్ పాల‌న ఎట్ల‌ ఉందంటే.. అన్ని ప‌నులు అస్త‌వ్య‌స్తంగా ఉన్నాయి. మేడ్చ‌ల్ వ‌ద్ద‌నే 45 నిమిషాలు ప‌ట్టింది. ఇక డిచ్‌ప‌ల్లి వ‌ద్ద కొంద‌రు మ‌హిళ‌లు రోడ్డుకు అడ్డంగా కూర్చుని ధ‌ర్నా చేస్తున్నారు. ఏం క‌ష్ట‌మొచ్చింది అని దిగాను. వాళ్లు పోలీసోళ్ల భార్య‌లు. వ‌న్ పోలీసింగ్ కావాల‌ని డిచ్‌ప‌ల్లి బెటాలియ‌న్ వ‌ద్ద‌ ధ‌ర్నా చేస్తున్నారు. ధ‌ర్నా చేస్తున్న మ‌మ్మ‌ల్ని ర‌క్తం కారేలా గుంజుకుపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆ ఆడ‌బిడ్డ‌లు. అఖ‌రికి కాంగ్రెస్ పాల‌న‌లో పోలీసోళ్ల భార్య‌లు ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితి వచ్చాదని కేటీఆర్ అన్నారు.

First Published:  24 Oct 2024 3:22 PM IST
Next Story