నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం
ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడి
BY Raju Asari19 Oct 2024 1:55 PM IST
X
Raju Asari Updated On: 19 Oct 2024 1:55 PM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పింకు చొక్కాలు, మూడు రంగుల జెండాతో సంబంధం లేకుండా పేదలకు అందజేస్తామని మంత్రి తెలిపారు.
Next Story