Telugu Global
Telangana

ఆలయ ఘటనలపై ఎన్‌ఐఏ విచారణ : మంత్రి కొండా సురేఖ

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై మీద దాడి సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు.

ఆలయ ఘటనలపై ఎన్‌ఐఏ విచారణ : మంత్రి కొండా సురేఖ
X

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం మీద దాడి సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుమని మంత్రి పేర్కొన్నారు. దీనిపై ఎన్‌ఐఏ విచారణ కొరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఆలయంలో 14చోట్ల మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 47 చోట్ల టాయిలెట్స్ నిర్మించినట్లు చెప్పారు. విష్ణు పుష్కరిణీ గుండాన్ని ఏర్పాటు చేశామన్నారు.

చంటి బిడ్డ తల్లులకు ప్రత్యేక లాంజ్‎లు, ఎలక్ట్రిక్ వాహనాల సౌకర్యం కల్పించామని చెప్పారు. రూ. 15కోట్లతో దాతల సహాయంతో అన్నదాన సత్రం నిర్మించామని మంత్రి కొండా సురేఖ అన్నారు. 60కిలోల బంగారు తాపడంతో రాజగోపురం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. లడ్డూ నాణ్యతలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. భద్రాద్రి అభివృద్ధి కోసం కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని అన్నారు. రూ. 3కోట్లతో జానకి సదనం నిర్మిస్తున్నామని తెలిపారు. దేవాలయానికి సంబంధించిన 24సేవలు ఆన్ లైన్‎లో అందిస్తున్నామని ప్రకటించారు. వేములవాడ దేవస్థానానికి చెందిన 850కోడెలను రైతులకు అందించినట్లు సురేఖ తెలిపారు.

First Published:  18 Oct 2024 12:39 PM GMT
Next Story