Telugu Global
Telangana

మేం చీటర్స్ కాదు.. ఫైటర్స్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమతో పొత్తు కోసం ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయని కానీ తమ నాయకుడు కేసీఆర్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పారు కేటీఆర్. విపక్షాలు మాత్రం కేసీఆర్‌ ను ఓడించేందుకు ఒక్కటయ్యాయని విమర్శించారు.

మేం చీటర్స్ కాదు.. ఫైటర్స్‌
X

వుయ్ ఆర్ ఫైటర్స్.. నాట్ చీటర్స్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ వేశారు. సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ అంటూ రెండు ప్రశ్నల్ని ఆయన ట్విట్టర్లో ఉంచారు. ఈ రెండు ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.


1.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీతో బీఆర్ఎస్ ఎందుకు కలవాలనుకుంటుంది..?

2. GHMC ఎన్నికల్లో మేయర్ సీటు పొందేందుకు తగిన బలం తమకు ఉన్నప్పుడు ఇక బీజేపీతో పనేముంది..?

ఈ రెండు ప్రశ్నల్ని ట్విట్టర్ వేదికగా సంధించారు మంత్రి కేటీఆర్.

గతంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు..

బీఆర్‌ఎస్‌తో పొత్తుకి సిద్ధమంటూ గతంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ బాస్ ల అనుమతితోనే ఆయన ఆ ప్రతిపాదనలు చేసి ఉంటారన్నారు. అంటే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలనుకోవడం బీజేపీ జాతీయ నాయకులకి కూడా ఇష్టమేనని.. కానీ ఆ ప్రతిపాదనను తాము తిరస్కరించామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమతో పొత్తు కోసం ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయని కానీ తమ నాయకుడు కేసీఆర్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పారు కేటీఆర్. విపక్షాలు మాత్రం కేసీఆర్‌ ను ఓడించేందుకు ఒక్కటయ్యాయని విమర్శించారు. విపక్షాలు సైద్ధాంతిక విభేదాలు పక్కన పెట్టి మరీ కలిసి పనిచేశాయన్నారు. ఎన్డీఏలో చేరేందుకు సీఎం కేసీఆర్ తనను సంప్రదించారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని మరోసారి ఖండించారు మంత్రి కేటీఆర్.


First Published:  4 Oct 2023 1:58 PM IST
Next Story