Telugu Global
Telangana

'కొంగరకలాన్‌లో ప్లాంట్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం' ‍-కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ!

“మార్చి 2వ తేదీన జరిగిన మన‌ సమావేశంలో మీతో చర్చించినట్లుగా, కొంగర కలాన్‌లో మా యూనిట్ ను ఏర్పాటు చేయడానికి ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉంది. వీలైనంత త్వరగా కొంగర కలాన్ యూనిట్ ను ప్రారంభించడంలో మీ మద్దతును కోరుతున్నాను.'' అని యంగ్ లియు తన లేఖలో పేర్కొన్నారు.

కొంగరకలాన్‌లో ప్లాంట్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం ‍-కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ!
X

హైదరాబాద్ శివార్లలోని కొంగ‌ర క‌లాన్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లియు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు.

700 మిలియన్ డాలర్ల వ్యయంతో ఫాక్స్‌కాన్ కంపెనీ కర్నాటకలో ఐఫోన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించిన నేపథ్యంలో ఫాక్స్ కాన్ ఛైర్మన్ ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

“ మా హైదరాబాద్ పర్యటనలో నాకు, నా బృందానికి మీరు ఇచ్చిన ఆతిథ్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ అభివృద్ధికి మీ దార్శనికత, మీ ప్రయత్నాల నుండి నేను ప్రేరణ పొందాను. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.''

“మార్చి 2వ తేదీన జరిగిన మన‌ సమావేశంలో మీతో చర్చించినట్లుగా, కొంగర కలాన్‌లో మా యూనిట్ ను ఏర్పాటు చేయడానికి ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉంది. వీలైనంత త్వరగా కొంగర కలాన్ యూనిట్ ను ప్రారంభించడంలో మీ మద్దతును కోరుతున్నాను.'' అని యంగ్ లియు తన లేఖలో పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా వ్య‌క్తిగ‌తంగా సీఎం కేసీఆర్‌ను తైవాన్ కు ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. తైపి లో ఆతిథ్య స‌త్కారాల‌ను అందుకోవాల‌ని త‌న లేఖ‌లో సీఎం కేసీఆర్‌ను ఆయ‌న కోరారు.

కాగా కొంగ‌ర‌క‌లాన్‌లో ఏర్పాటు చేయ‌బోయే ఫ్యాక్ట‌రీ వ‌ల్ల ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఫాక్స్ కాన్ గతంలోనే తెలిపింది. కొంగరకలాన్‌లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీని నెలకొల్పనున్నారు. ఈ కంపెనీ ఐ ఫోన్లను తయారు చేస్తుంది.

First Published:  6 March 2023 2:25 PM IST
Next Story