కేటీఆర్ కు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన స్వాగతం
వరంగల్ లో వివిధ కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
BY Naveen Kamera10 Nov 2024 1:28 PM IST

X
Naveen Kamera Updated On: 10 Nov 2024 1:28 PM IST
వరంగల్‌లో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వెళ్తోన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ శ్రేణులు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో పూలు చల్లి స్వాగతం పలికారు. జనగామలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విహానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. హన్మకొండలో జరిగే పలు వివాహాలకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఆ తర్వాత మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇంట్లో లంచ్ కు హాజరుకానున్నారు.
Next Story