Telugu Global
Telangana

పరిపాలన వికేంద్రీకరణకోసం వార్డు కార్యాలయాలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పక్కా వ్యూహంతో వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మంత్రి సమావేశమయ్యారు.

పరిపాలన వికేంద్రీకరణకోసం వార్డు కార్యాలయాలు
X

పాలన వికేంద్రీకరణ స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాల ఏర్పాటుతో సుపరిపాలన మరింత బలోపేతమవుతుందని తెలిపారు. కొత్త విధానాన్ని కార్పొరేటర్లు విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని చెప్పారు. కార్పొరేటర్లు.. బీఆర్‌ఎస్‌ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు. ఏడాది పాటు విస్తృతంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు మంత్రి.

గ్రేటర్ పరిధిలో పక్కా వ్యూహం..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పక్కా వ్యూహంతో వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మంత్రి సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు కార్పొరేటర్లు బాసటగా నిలవాలని, వారి విజయానికి కృషి చేయాలని, ఆ దిశగా ప్రజల్ని మోటివేట్ చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

ఈ నెల 16న బీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ కార్పొటర్లతో సమావేశమయ్యారు. వార్డు కార్యాలయాల కార్యకలాపాలు వివరించారు. ఈ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింతగా అందుబాటులో ఉండాలని సూచించారు. నిత్యం ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను వారికి వివరిస్తూ బీఆర్ఎస్ ని బలోపేతం చేయాలన్నారు.

First Published:  13 Jun 2023 5:19 PM IST
Next Story