Telugu Global
Telangana

కేటీఆర్ ఆలోచన భేష్.. వార్డు కార్యాలయాలు సక్సెస్

ఈనెల 16న 150చోట్ల వార్డుకాల్యాలయాలు మొదలు కాగా.. దాదాపు అన్ని చోట్ల పౌరులు, ప్రభుత్వ సిబ్బంది సేవలు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఒక్కో వార్డు కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన 10 మంది సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.

కేటీఆర్ ఆలోచన భేష్.. వార్డు కార్యాలయాలు సక్సెస్
X

మంత్రి కేటీఆర్ ఆలోచనతో తెరపైకొచ్చిన వార్డు కార్యాలయాల పనితీరు పట్ల హైదరాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం, జోనల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు తమ వార్డులోనే తమ సమస్యకు పరిష్కారం లభిస్తోందని అంటున్నారు. వార్డు పరిధిలోకి వచ్చే సమస్యలకు అక్కడికక్కడే సమాధానం లభిస్తోంది. డ్రైనేజీ, కరెంటు, తాగునీరు, పార్కింగ్, ఆక్రమణలు.. వంటి సమస్యలపై వార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే వాటిని పరిష్కరిస్తున్నారు సిబ్బంది.





గతంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా జోనల్ కార్యాలయాలకు పరుగులు తీసేవారు, అర్జీలు పెట్టేవారు. జోనల్ వ్యవస్థలో ఫిర్యాదులను విశదీకరించి, పరిశీలించి, పరిష్కరించడం ఆలస్యంగా జరిగేది, కానీ వార్డు కార్యాలయాలు వచ్చిన తర్వాత ప్రతి పరిష్కారానికి గరిష్ట సమయం కేటాయించారు. గడువు లోపు వాటిని పూర్తి చేయాలని, లేకపోతే పురోగతి వివరించాలనే నియమం పెట్టారు. దీంతో పౌరులకు తక్షణ ఉపశమనం లభిస్తోంది. ఈనెల 16న 150చోట్ల వార్డుకాల్యాలయాలు మొదలు కాగా.. దాదాపు అన్ని చోట్ల పౌరులు, ప్రభుత్వ సిబ్బంది సేవలు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఒక్కో వార్డు కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన 10 మంది సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. త్వరలో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ తరపున కూడా వార్డు కార్యాలయాలకు సిబ్బందిని పంపిస్తారు. సిటిజన్ చార్టర్ రూపొందించి ఆయా సమస్యల పరిష్కారానికి డెడ్ లైన్ విధించారు.

ఇటీవల వార్డు కార్యాలయాల పనితీరుపై మంత్రి కేటీఆర్ జరిపిన సమీక్షలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. వార్డు కార్యాలయాల వల్ల తమకు సమయం ఆదా అవుతోందని, సమస్య చిటికెలో పరిష్కారమవుతోందని అంటున్నారు నగరవాసులు. 10రోజుల్లోనే ఈ వ్యవస్థ పనితీరుపై మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో వార్డు కార్యాలయ వ్యవస్థ సక్సెస్ అని తేలిపోయింది.

First Published:  29 Jun 2023 7:16 AM IST
Next Story